కులగణనకి ఇంకెన్నాళ్లు..?

జన గణ మన అధినాయక జయహే భారత.. అనేవాళ్లు 140 కోట్ల జనాభాలో 70 కోట్లమంది బీసీలు. అలాగే భారత్‌కు జై అనేవాళ్లలో జనగణన

Update: 2024-07-14 00:45 GMT

జన గణ మన అధినాయక జయహే భారత.. అనేవాళ్లు 140 కోట్ల జనాభాలో 70 కోట్లమంది బీసీలు. అలాగే భారత్‌కు జై అనేవాళ్లలో జనగణన నహి అనేవాళ్లు పిడికెడు మంది. పాలకులు ....మూడువేల కులాలుంటే... ముప్పై కులాలు కూడా చట్టసభల మెట్లు నేటికీ ఎక్కకపోవడం అన్యాయం కాదా! ఇవన్నీ చూస్తుంటే ఆలోచనా పరులకు కళ్లలో నీళ్లు వస్తున్నాయి... అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందమా? అన్న కవి మాటలు గుర్తొస్తున్నాయి.

బీసీల లెక్కా పత్రం పక్కకు పెట్టడం ఇంకెన్నాళ్ళు.. వారి లెక్కలను పక్కకు పెట్టేవాళ్ళు పిడికెడు మంది పాలకులు మాత్రమే .... అసలు లెక్క తేలకపోవటమే పాలకుల అంతరమా .... లెక్క తెలిస్తే చిక్కుముడులు వస్తాయనే భయమా... ఒకవేళ లెక్క తేలకపోయినా.... లెక్కల పేరుతో గందరగోళం సృష్టించినా... కొంచెం వెనుకా ముందు అయినా చిక్కుముడులు విప్పే సంఖ్య సత్తా బీసీలకు ఉంది... అసలు వడ్డీ తీసుకునే తెచ్చుకునే రోజులు ఉంటాయి. అని కవి గుర్రం జాషువా అన్నారు ..

రాజకీయ అనాధలుగా బీసీలు

రెండు రేళ్లు నాలుగు అనేది ఎంత నిజమో ఈ దేశంలో బీసీలు 60 శాతం దాకా ఉన్నరన్నది అంతే నిజం. నోరులేని మూగజీవులు బీసీలు... సకల రంగాలలో వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో సరిగా చెప్పుకోలేని సాంఘిక వెనుకబాటుతనంలో ఉన్న రాజకీయ అనాధలు బీసీలు... వారి సామాజిక, ఆర్ధిక వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకొని ఏడున్నర దశాబ్దాలుగా వంచనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతున్నారు. ఈ అవమానాలకు అసమానతలకు గురవుతున్న బీసీలు ఎందుకు ఐక్యం కాలేకపోతున్నారు

చుక్కలు చూపించిన బీసీలు

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో... బీసీ జనాభా లెక్కలు చెయ్యమన్న బీజేపీకి బీసీలు చుక్కలు చూపించారు... అందుకని ఈ పరిణామాత్మక, గుణాత్మక మార్పులు గుర్తించి తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా పక్కాగా కుల ఆధారిత లెక్కలు తియ్యాలి. సమాజంలో సగానికి పైగా ఉండి అవమానాల్లో, అవకాశాల్లో మగ్గిపోతున్నారు బీసీలు. అందుకే లెక్కలు కావాలి. సకల రంగాల్లో అసమాన పంపిణీని సమానం చేసేందుకే బీసీలు ముక్త కంఠంతో లెక్కలు అడుగుతున్నారు. గణతంత్రం జనతంత్రం కావాలంటే! జనగణన ఇంకెన్నాళ్లని బీసీలు మేధావులు అడుగుతున్నారు...ఈ దేశంలో చెట్లకు పుట్టలకు లెక్కలున్నాయి. సమాజంలో ప్రాణం ఉన్న మనుషులకు ఎందుకు లెక్కలు తియ్యరని ముక్త కంఠంతో బీసీలు డిమాండ్ చేస్తున్నారు...

మనుషుల లెక్కలపై మల్లగుల్లాలెందుకు

గత ప్రభుత్వం రకరకాల కారణాలతో కేవలం పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు 17-18 శాతానికే పరిమితం చేసి బీసీలకు అన్యాయం చేసింది... రాహుల్ గాంధీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించటం దేశవ్యాప్తంగా చర్చ అయ్యింది. అంతేందుకు ఇండియా కూటమిలో ఇది ఎలక్షన్ ఎజెండాగా మారింది. లెక్కలు చేయం అన్న బీజేపీకి అరకొర మెజారిటితో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. దీంతో బీజేపీ సతమతమవుతోంది. బీజేపీ పదేళ్లు అధికారంలో ఉండి... కుల ఆధారిత లెక్కలు చెయ్యబోమని చెప్పటంతో ఉత్తరాదిలో జనరల్ సీట్ అయిన అయోధ్యలో కూడా బీజేపీ ఎంపీ ఓడిపోయారు. ఇందుకు కుల జనగణన చెయ్యకపోవడం కూడా ఓ కారణమే...

ఇంటింటి సర్వేతో కులాల లెక్కలు

బీసీ కమిషన్ మధ్యంతర ఉత్తర్వులతో మమ అనిపించొద్దు. ఇంటింటి సర్వేతో అన్నీ కులాల లెక్కలు తియ్యాలి. కుల సంఘాలు అన్నీ బీసీ కుల మేధావులతో సమగ్రంగా చర్చించి చెయ్యాలి... కొన్ని రకాల మీటింగులకు విద్యార్థులను వాడుకుంటున్నారు... వారిని అలాకాకుండా కులగణనకు ఉపయోగించవచ్చు.టిక్‌లు కొట్టే కాలమ్స్ ఉంటాయి తేలికగా చెయ్యొచ్చు. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వారి ప్రాంతంలోనే యాభై ఇళ్లు కేటాయించి..ఉద్యోగులతో మూఢంచెలుగా చెక్ చేసి మూడు నుంచి ఐదు రోజుల్లో రాష్ట్రం మొత్తం లెక్కలు తీయొచ్చు. ఇలాంటి విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. స్వాతంత్రం.. గణతంత్రం అయితేనే అది ప్రజాతంత్రం అవుతుంది. గణతంత్రం పేరుతో నిర్వహించేది అంతా ప్రజాస్వామ్యం కాదు. అది చోర తంత్రం ..అందుకే కులగణన చెయ్యాలి.

సాదం వెంకట్

జర్నలిస్ట్

93953 15326

Tags:    

Similar News