ఆమె కవిత్వం పశ్చిమాసియాలో ప్రభంజనం !

Her poetry is booming in West Asia!

Update: 2024-03-16 00:30 GMT

మోమిత ఆలం పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతానికి చెందినవారు. వీరిది కమ్యూనిస్టు భావజాలానికి చెందిన కుటుంబం. ఆ భావజాలాన్ని ఈమె కూడా పుణికి పుచ్చుకున్నారు. ఈమె మీద అమ్మమ్మ ప్రభావం చాలా ఉంటుంది. తన ఊర్లో పెద్ద బడి లేకపోవడంతో, సుమారుగా 10 కిలోమీటర్లు దూరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదవడానికి రోజు సైకిల్ మీద వెళ్ళేది. తన చుట్టుపక్కల రైతుల కష్టసుఖాన్ని ఆ విధంగా ఆమె దగ్గరగా చూసింది. వాళ్లంతా ఆలుగడ్డలు ఉత్పత్తి చేసే రైతులు.

ఒక ముస్లిం కుటుంబం నుండి వచ్చినప్పటికీ, మౌమిత ఆలం పితృస్వామిక వ్యవస్థకు ఎదురుగా నిలిచింది. భర్తతో వివాహబంధం ఎక్కువ కాలం సాగలేదు. వేధింపులకు తట్టుకోలేక విడాకులు ఇచ్చేసింది. తాను ఇప్పుడు ఒంటరితల్లి. తన బిడ్డతో బాటు ఉంటూ స్కూల్లో టీచరుగా పనిజేస్తున్నారు. కాశ్మీర్లో 370 ప్రకరణ రద్దు చేశాక చాలా ఆందోళనకు గురై పెన్ను పట్టారు. శోభనం రాత్రి పెళ్లికూతురు వేస్తున్న కేకలను విని చలంగారు పెన్నుపట్టినట్టే కాశ్మీరీ ప్రజల ఆందోళన చూసి, ఆమె పెన్ను పట్టింది. 2019 నుండి వరుసగా కవితలు రాయడం మొదలుపెట్టారు. తాను బెంగాల్లోనూ ఇంగ్లీషులోనూ విరివిగా కవిత్వం రాస్తుంది. ఇప్పటికీ

1. musings of dark 2 . poems at daybreak 3. smell of azaadi వెలువరించింది.

ఈమె కవితలు outlook, the wire, Dhaka tribune, Madras courier, countercurrents వంటి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. తెలుగులో అరుణతార, మాతృకలో అచ్చయినాయి. పశ్చిమ బెంగాల్లోని ఓ పత్రికకు తాను రెగ్యులర్‌గా రాస్తుంది. కేవలం నాలుగు సంవత్సరాల నుండి (2019) రాస్తున్న మోమితా ఆలం, పశ్చిమ ఆసియాలో ఒక ప్రభంజనంలా దూసుకొస్తున్నది. ఈమె కవితలు తెలుగు, హిందీ మలయాళం, తమిళ్, ఒరియా భాషల్లోకి అనువాదం అయినాయి. ప్రస్తుతం ఈమె కవితలలో కొన్నింటిని ఉదయమిత్ర తెలుగులోకి అనువాదం చేసి... 'రాయగూడని పద్యం' అనే పేరుతో తెస్తున్నారు.

ఈ పుస్తకావిష్కరణ 17_03_24 నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుందరయ్య విజ్ఞాన్ భవన్లోని దొడ్డి కొమరయ్య హాల్లో ఉంటుంది. వక్తలుగా ప్రముఖ కవయిత్రి మమతా ఆలం వస్తున్నారు. సంధ్య అధ్యక్షతన హరగోపాల్, విమల, పుప్పాల శ్రీరామ్ చరణ్, సాత్వికలు పాల్గొంటున్నారు.

ఉదయమిత్ర

ప్రముఖ కవి, రచయిత

89196 50545

Tags:    

Similar News