ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్

Fir Ek Bar Modi Sarkar

Update: 2024-05-02 00:30 GMT

ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం దేశమంతా మారుమోగుతోంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలని దేశం కాంక్షిస్తోంది. మోడీ భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేయడమే కాదు.. శిఖరాగ్రాన నిలబెట్టారని దేశం నినదిస్తోంది. అందుకే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ గర్జన చేస్తోంది.

పదేళ్ల నరేంద్రుని పాలన ఈ దేశానికి ఓ మార్గం చూపింది. ఇప్పుడు ఆ తోవలో మరిన్ని విజయాలను అందుకునేందుకు దేశం బీజేపీ విజయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే..యూసీసీ(యూనిఫామ్ సివిల్ కోడ్), ఒకే దేశం - ఒకే ఎన్నిక, ఎన్నార్సీ వంటి కీలక బిల్లులను తీసుకురానుంది.

పేదరికం పెంపుదలకే గత విధానాలు

కాంగ్రెస్ హయాంలో పేదరికంలో దేశం ప్రప్రథమ స్థాయిలో పోటీలో ఉండేందుకు పాలకుల విధానాల రూపకల్పన ఉన్నట్టుగా అనిపించింది. ఒక్క జాతీయ ఉపాధి హామీ పథకం మినహా పేదరిక నిర్మూలన కోసం ఆ పార్టీ తీసుకున్న చర్యలు శూన్యం. కానీ మోదీ ప్రభుత్వం చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందే విధంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. అంత్యోదయ సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్న బీజేపీ ఈ పదేళ్ల ప్రస్థానంలో ఇదే విధానాన్ని అనుసరించడమే కాదు ఆచరించింది. అందుకే బీజేపీ అంటే అర్బన్ పార్టీ అనే ముద్రను తొలగించుకొని రూరల్ ఏరియాలోకి కూడా చొచ్చుకుపోయి బలీయంగా మారింది. ఎంతోమంది జాతీయవాదులకు వెన్నుదన్నుగా నిలుసున్నది. అందుకే బీజేపీ ఈసారి చార్ సౌ పై కన్నేసి దృఢమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ప్రజల మనస్సులను గెలుచుకుంటుంది.

పదేళ్లలో వినూత్న మార్పులు

అభివృద్ధి పేరిట అవినీతిని ప్రోత్సహించిన ఘనత కాంగ్రెసుది.. అభివృద్ధి పేరుతో ఈ దేశానికి కొత్త నగిషీలు చిక్కింది బీజేపీ. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించింది. బీజేపీయేతర ప్రభుత్వాలకు కూడా కేంద్ర నిధుల విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా నిధులను ఇచ్చింది. సమాఖ్య స్ఫూర్తిని చాటింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ పేరుతో ప్రాంతీయ ఉత్పత్తులకు పెద్దపీట వేయడం వంటి నిర్ణయాలతో దేశాన్ని బలమైన పునాదుల మీద నిర్మాణం చేస్తున్నది.

అలాగే పదేళ్లలో దేశంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. వివాదాస్పద 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఒకే దేశం - ఒకే రాజ్యాంగం - ఒకే జెండా అనే విధానాన్ని అమలు చేసింది. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ వ్యతిరేకులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించక తప్పని పరిస్థితిని కల్పించింది. దీని రద్దు తర్వాత ముస్లిం మహిళలు బీజేపీ జెండాను ఆయా చోట్ల గుండెలకత్తుకున్నారు. ఏళ్లనాటి కల సాకారం అయిందని ఉద్వేగాన్ని ప్రదర్శించారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలతో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా చెత్త బుట్టలో వేసింది. అవసరమైనప్పుడు కదిలించి.. ఎన్నికలయ్యాక దానిని పక్కన పెట్టడం కాంగ్రెస్ కు షరామామూలే. కానీ , దశాబ్దాల ఆకాంక్షను మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించింది. రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు నానా యాగీ చేసినా ఆ అవాంతరాలను దాటుకొని మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించింది. ఇదంతా సుస్థిరమైన, సమర్ధవంతమైన నాయకత్వంతోనే సాధ్యం కాబట్టి.. బీజేపీకి 400సీట్లకు తగ్గకుండా గెలిపిద్దాం.. దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే యజ్ఞంలో పాత్రను నిర్వహిద్దాం. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్..!

కిరణ్ చింతపల్లి

ఉస్మానియా యూనివర్సిటీ

99896 32612

Tags:    

Similar News