జనామోదంలేని జగన్నాటకం
తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు, సాధుపరిషత్ సభ్యులు జగన్ పర్యటనను
తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు, సాధుపరిషత్ సభ్యులు జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు జగన్ పర్యటనను వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జగన్ తిరుమల పర్యటన వెళ్లాలని నిశ్చయించుకోవడం, డిక్లరేషన్ అంశం తెరపైకి నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన యావత్తు ఓ ప్రహసనంగా మారిందన్నది నిజం. ఆత్మసాక్షి ప్రబోధం మేరకు ప్రస్తుత పరిస్ధితుల దృష్యా పర్యటన వాయిదా వేసుకున్న తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టలేని సంకట పరిస్థితుల్లో జగన్ పర్యటన రద్దు చేసుకొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందూ సంప్రదాయాల పట్ల జగన్‌కు సదాభిప్రాయం లేదనే టాక్ వస్తుంది. హిందువుల్లో వ్యతిరేక భావం కలుగుతుంది. ఈ సంకటస్థితిలో జగన్నాటకం జనామోదం పొందలేకపోయింది. ఇప్పటికైనా ఆధ్యాత్మిక నగరిలో రాజకీయ జగడాలకు స్వస్తి చెప్పి. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి.
డిక్లరేషన్ నిబంధన ఈనాటిది కాదు!
శ్రీవారిని దర్శించుకునేందుకు ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసే సంప్రదాయం బ్రిటీష్ కాలం నుంచే అమల్లో ఉన్నది 1933లో టీటీడీకి ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ను నియమించారు. అప్పటి వరకూ మహంతుల పర్యవేక్షణలోనే టీటీడీ వ్యవహారాలు సాగేవి. ఆ సమయంలో ఇతర మతాలకు చెందిన వ్యక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తే డిక్లరేషన్ ఇచ్చేవారని పేర్కొంటున్నారు. అప్పట్లో బ్రిటీష్ వారు టీటీడీ ఆలయం జోలికి రాలేదు. టీటీడీ ఆలయాల్లోకి అన్యమతస్థులు ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వాలంటూ 1990 ఏప్రిల్ 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశాన్ని ఛాప్టర్ 18లో పొందుపర్చారు. ఇతర మతస్థులు టీటీడీ ఆలయాల్లోని దేవుళ్లను దర్శించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందుకోసం డిక్లరేషన్ సమర్పించాలని నోటిపికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. తితిదేలోని 136వ నిబంధనను అనుసరించి రూపొందించారు. స్వామి దర్శనానికి వెళ్లే అన్యమతస్థులు తమ పేరు, మతాన్ని పేర్కొంటూ శ్రీవెంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం, గౌరవం ఉందని అందువల్ల దర్శనానికి అనుమతించాల్సిందిగా పేర్కొంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంది. ఈ డిక్లరేషన్‌ను టీటీడీలోని పేష్కార్‌కు కానీ ఇతర ఆలయాల్లో ఆలయ ఇన్‌ఛార్జిగా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సి ఉందని అందులో వివరించారు. దానికి ఆమోదం లభించాక ఇతర భక్తుల తరహాలోనే స్వామిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
మాజీ సీఎం పర్యటన రద్దు
తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు, సాధుపరిషత్ సభ్యులు జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు జగన్ పర్యటనను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జగన్ తిరుమల పర్యటన వెళ్లాలని నిశ్చయించుకోవడం, డిక్లరేషన్ అంశం తెరపైకి నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. మతం పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను తిరుమల శ్రీవారి దర్శించటాన్ని ప్రభుత్వం ఆడ్డుకుందని పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారని వైఎస్సార్సీపీ నాయకుల అరోపణ . దీనిపై హోం మంత్రి వివరణ ఇస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ, వై. చంద్ర చూడ్ తిరుమల పర్యటన బ్రహ్మోత్సవాల నేపథ్యం లో భాగంగానే చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.
రాజకీయ జగడాలకు స్వస్తి చెప్పి
మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన యావత్తు ఓ ప్రహసనంగా మారిందన్నది నిజం. ఆత్మసాక్షి ప్రబోధం మేరకు ప్రస్తుత పరిస్థితుల రీత్యా పర్యటన వాయిదా వేసుకున్న తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేని సంకట పరిస్థితుల్లో జగన్ పర్యటన రద్దు చేసుకొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వరని, ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో భూమన కీలక వ్యాఖ్యలు సమస్యను మరింత తీవ్రతరం చేశాయి, జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే తాను క్రిస్టియన్ అని అంగీకరించినట్లవుతుంది. క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయాలపై కక్షగట్టారని కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలు బలం చేకూర్చినట్లవుతుంది. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందూ సంప్రదాయాలపట్ల జగన్‌కు సదాభిప్రాయం లేదనే టాక్ వస్తుంది. హిందువుల్లో వ్యతిరేక భావం కలుగుతుంది. ఈ సంకట స్థితిలో జగన్నాటకం జనామోదం పొందలేకపోయింది. ఇప్పటికైనా ఆధ్యాత్మిక నగరిలో రాజకీయ జగడాలకు స్వస్తి చెప్పి. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం, తిరుమల తిరుపతి పాలకవర్గం డిక్లరేషన్ నిర్ణయంపై నిర్దిష్టమైన స్పష్టమైన విధివిధానాలు నియామవళి రూపొందించి అమలు చెయ్యాలి. స్వచ్ఛమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. బ్రహ్మోత్సవాల సమయానికి ఈ పరిస్థితిని చక్కదిద్దే దిశగా చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలు కాపాడి. పరమ పావనమైన కలియుగ వైకుఠానికి పూర్వ వైభవం తీసుకురావాలి. 'క్షమస్వత్వం శేషశైల శిఖామణే!' అని స్వామిని ప్రార్థించి, ఆలయ వ్యవస్థలను ధర్మానుగుణంగా సంస్కరించుకునే చైతన్యం రావాలని ఆశిద్దాం!
సుధాకర్ వి
99898 55445