ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా

Ennu ninte moideen film that makes the audience think

Update: 2024-04-11 00:45 GMT

తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది. అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగినప్పటికీ, అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు. అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది. చివరికి, కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి తన ఇంటిని విడిచిపెట్టి వస్తుంది. ఇది ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా. అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు. 2015 సెప్టెంబర్ 19 న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది. “కత్తిరున్ను” పాటకు సంగీత దర్శకుడు ఎం.జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం. నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు. అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం.

చిత్రం : ఎన్ను నింటే మొయిదీన్

నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతీ తిరువొట్టు

సంగీతం : ఎమ్. జయచంద్రన్

కథ, దర్శకత్వం ఆర్ఎస్ విమల్

-కోట దామోదర్

93914 80475

Tags:    

Similar News