వేదాలు స్త్రీలను తొక్కేశాయా?

వేదాలు స్త్రీలను తొక్కేశాయా?... Did the Vedas trample on women

Update: 2023-01-20 19:00 GMT

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి పేర్కొన్నారు. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు. వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేచ్ఛ నివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో పరిశీలించి తర్వాత ఈ ఆరోపణల నిగ్గు తేలిస్తే మంచిది.

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేచ్ఛ నివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్థుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్థులకు, ఇతర ఉద్యోగార్థులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03

స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20

స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)

స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74

స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2

స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1

పరిపాలన విషయంలో స్త్రీలు

పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి - అధర్వణవేదం 7.38.4

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు

పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

కుటుంబం

సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17

(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)

నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

ఉద్యోగాల్లో

స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2

స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా! (శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరథుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ). కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి -ఋగ్వేదం 10.85.26

విద్యా విషయాల్లో

ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక! మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను -ఋగ్వేదం 10-191-3

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి పేర్కొన్నారు. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

వివాహం -విద్యాభ్యాసం

ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధి పరుచు - అధర్వణవేదం 14-1-64

(ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

తిరుమల మనోహర్ ఆచార్య

99890 46210

Also Read...

మానసిక విశ్లేషణాత్మక సినిమా 'కాసవ్' 


Tags:    

Similar News