కాంగ్రెస్ ప్రజలందరి పార్టీ

Congress is a party of all people

Update: 2023-12-29 00:30 GMT

ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించి వారి జీవితాలకు ఊపిరి అందించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అట్టడుగు వర్గాల కష్ట సుఖాలలో పాలుపంచుకొని వారికి అభయం అందించి, వారి రూపురేఖలు మార్చింది. కార్మిక శ్రామిక కూలీ రైతుల ఉద్యమాలకు నాయకత్వం వహించి హక్కులు సాధించిన పార్టీ .. అధికారంలో ఉన్నప్పుడు శ్రామిక వర్గానికి రెడ్ కార్పెట్ వేసి వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా చూడాలని పరితపించింది. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను అమలు చేసి వారికి సిరులు వర్షం కురిపించింది. దశాబ్దాల పోరాటాలు, ఎందరో త్యాగధనుల పోరాటం, 5 తరాల పోరాటం చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీర్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ .. దేశ పౌరుల ప్రాథమిక హక్కుల కోసం ఎదిరించి నిలిచిన పార్టీ..

పార్టీ అంటే అధికారం కాదు ప్రజల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులు మార్చాలి దాని కోసం పార్టీనైనా త్యాగం చేస్తామని ప్రతిన చేసిన పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల కళ్ళలో ఆనందం కోసం ఉగ్రమూకలతో పోరాడి దేశం కోసం, రాబోయే తరాల కోసం వారి ప్రాణాన్ని తృణప్రాయంగా తూటాల మాలకు నేలకొరిగిన పార్టీ ..ప్రజల బాధలను తెలుసుకొనుటకు వారి చెంతకు చేరితే వారి శరీరం బాంబుల ధాటికి మాంసపు ముద్దలు త్యాగం చేసిన పార్టీ.. మూడు తరాలు వారి జీవితాలు ప్రజలు కోసం ఆత్మార్పణ చేసిన ప్రజా జీవితాలలో ఇంకా వెలుగుతున్న పార్టీ.. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కావాలి అనే ఆలోచన ద్వారా అప్పటికి ఇప్పటికీ వారి వెన్ను వెనకాల నిలిచి వారిని గెలిపించిన పార్టీ.. అధికారమే పరమావధిగా భావించి ప్రజలు మీద వారి ప్రాథమిక హక్కుల మీద విషం కక్కుతున్న పార్టీలు ఉన్న ఈ రోజులలో అధికారం ఉన్నా, లేకున్నా ప్రేమ ద్వారాలు తెరిచిన పార్టీ.. దేశం కోసం పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ, ఎన్నో ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చి వారి ఆలోచనలను పంచుకొని దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఇంకా ఎన్నో త్యాగాలకు సిద్ధంగా ఉన్న నా పార్టీ మన పార్టీ ప్రజలందరి పార్టీ, మన అందరి కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

(కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా)

-బిచ్చాల అన్వేష్

యువజన కాంగ్రెస్, ఖమ్మం

96669 17596

Tags:    

Similar News