ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి..
స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు క్రిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ విద్యుక్త
స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు క్రిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించే సందర్భంలో సత్ప్రవర్తన కలిగి పని చేయాలి. అందుకోసమై మార్గదర్శక ప్రవర్తనా నియమావళి 1964ను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రవర్తనా నియమావళికి లోబడే ఉద్యోగులందరూ తమ విధులను నిర్వహించాలి. అటువంటి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి ప్రవర్తించిన ఉద్యోగులపై అర్హత గల నిర్దేశిత అధికారులు గానీ, ప్రభుత్వం గానీ క్రమశిక్షణా చర్యలు తీసుకుని తగిన పద్ధతిలో శిక్షిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.
ఎవరికి వర్తిస్తాయి.. ఎవరికి వర్తించవు..?
తెలంగాణ ప్రభుత్వ సివిల్ సర్వీసులో ఉన్న ప్రతి సభ్యునికి, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏ పోస్టులో పనిచేస్తు వారైనప్పటికీ, వారందరికి ప్రవర్తనా నియమావళి వర్తిస్తాయి. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు, గ్రామ పరిపాలన యంత్రాంగం, ప్రత్యేక పద్దు నుంచి చెల్లింపులు పొందువారికి వర్తించవు.
కుటుంబ సభ్యులంటే ఎవరు..?
ఉద్యోగిపై ఆధారపడిన భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి కూతురు, ఉద్యోగితో పాటు నివాసముంటున్నా, లేకపోయినా.. ఉద్యోగికి చెందిన ఏ ఇతర బంధువైనా, అతనితో నివాసముంటూ అతనిపై ఆధారపడి ఉన్నవారు. ఉద్యోగి నుంచి చట్టరీత్యా విడిపోయిన భార్య / భర్త, ఉద్యోగిపై ఏ విధంగానూ ఆధారపడకుండా ఉన్న కుమారుడు, కుమార్తె, కుమారుడు, సవతి కుమార్తె లేక చట్టరీత్యా ఉద్యోగి సంరక్షణలో లేని వ్యక్తి.
ప్రవర్తనా నియమావళి..
ప్రతి ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను అంకితభావంతో నిర్వర్తించాలి. అంకితభావం అంటే విశ్వతనీయత కలిగి పని చేయడం. అదే విధంగా పూర్తి నిజాయితీగా, క్రమశిక్షణ కలిగి, నిష్పక్షపాతంగా న్యాయబద్ధతంగా కలిగి పనిచేయాలి. ఉద్యోగి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉండకూడదు.
Rule 3 (a) : ఏ ఉద్యోగియైనా దేశ భద్రతకు,రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశం గల సంస్థలతో సంబంధాలు కలిగి సభ్యునిగా ఉండకూడదు.
Rule 3 (b) : విధి నిర్వహణలో గాని, ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు. తనకు కేటాయించినపనిని దురుద్దేశంతో గాని మరి ఇత రత్రా కారణాల వల్లగాని అదే పనిగా ఆలస్యం చేయకూడదు.
Rule 3 (C) : ఏ ఉద్యోగి అయినా సరే తన విధి నిర్వహణలో ఉద్యోగినిల విషయంలో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అమర్యాద పూర్వకంగా కాని, అసభ్యంగా గాని ప్రవర్తించకూడదు. అదే విధంగా లైంగిక వేధింపులకు గురిచేయకూడదు.
Rule 4: ఏ ఉద్యోగి కూడా సమ్మెలు తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు.
Rule 5 : రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనలలో పాల్గొనకూడదు.
Rule 6 : ఏ ఉద్యోగి కూడా బహుమతులు స్వీకరించకూడదు.
Rule 6 A: విదేశాల నుంచి డబ్బుగాని లేక 10,000 రూపాయల విలువగల వస్తువులు గాని ఎవరి నుంచైనా, ఉద్యోగి కాని, కుటుంబ సభ్యులు కాని లేక వారి తరఫున ఏ వ్యక్తియైనా పొందితే సంబంధిత అధికారికి తెలియజే యాలి.(G.O.Ms. No. 354, GAD, dt: 8-8-1996)
Rule 7: ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయడం గాని, తీసుకోవడం గాని చేయకూడదు.
Rule 8 : ఏ ఉద్యోగియైనా ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా తన ఉద్యోగ కార్యకలాపాల పరిధిలోని వ్యక్తులతో గాని ఇతరత్రా అప్పు తీసుకొనకూడదు. అదే విధంగా వడ్డీకి అప్పు ఇవ్వరాదు.
Rule 9 : ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి ముందుగా తెలుపకుండా లేక అనుమతి పొందకుండా తానుగాని తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు గాని స్థిరాస్థులు కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదు. ఈ విషయంలో కొన్ని మినహాయింపులు చేశారు.
Rule 10: ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రైవేటు వ్యాపారాలు తదితరాలు చేయకూడదు. అదే విధంగా బీమా ఏజెంటు గానూ, కమిషన్ ఏజెంటుగాను పనిచేయకూడదు.
Rule 11 : ఏ ఉద్యోగి కూడా తన వ్యక్తిగత హెూదాలో బ్యాంకులు గానీ, రిజిష్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కానీ సమాజ సేవా దృక్పథంతో రిజిష్టరు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చును.
Rule 12: ప్రభుత్వ ఉద్యోగస్థులు తమ ఉద్యోగ బాధ్యతలు తప్ప ఏ విధమయిన ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు.
Rule 13: ప్రభుత్వ ఉద్యోగి ఏవైనా పుస్తకాలు ప్రచురించదలచిన ప్రభుత్వ పూర్వానుమతి పొందాలి. ఈ విషయమై కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం G.O.Ms. No. 553, GAD, 8: 8-8-1974 2 జారీ చేసింది.
Rule 14: ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన స్వాధీనంలో వున్న డాక్యుమెంట్లు తనకు తెలిసిన ఇతర కార్యాలయపు విషయాలు అనధికారులకు గానీ లేక పత్రికల వారికి గాని తెలియజేయకూడదు. కానీ సమాచార హక్కు చట్టం- 2005 వచ్చిన తరువాత దీనికి కొంతమేర మార్పులు చేసారు. (G.O.Ms. No. 114, GAD, dt: 16-3-2009)
Rule 15: ఏ ఉద్యోగి కూడా వార్తాపత్రికలకు గాని, ప్రభుత్వేతర ప్రచురణలకు గాని సంపాదకత్వం చేయటం, వాటితో ఏ రూపంలోనైనా కలిసి పనిచేయకూడదు.
Rule 16: పత్రికలకు, అదేవిధంగా దఫాలుగా ప్రచురితమయ్యే నియమితకాల పత్రికలకు లేఖలు గాని, వ్యాసాలు గాని ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా వ్రాయడం నిషేధం. కాని సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ సంబంధిత వ్యాసాలు కాని, వాటి ఆధారిత రేడియో ప్రసంగాలు గాని చేయవచ్చును.
(మిగతాభాగం తరువాతి సంచికలో...)
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి STUTS
90006 74747