కుల సంఘాల ప్రక్షాళన అవశ్యం!

తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆత్మబలిదానాలకు కూడా వెనుకాడకుండా ఎంతో అంకితభావంతో ఉద్యమాన్ని ముందు

Update: 2024-05-28 00:45 GMT

తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆత్మబలిదానాలకు కూడా వెనుకాడకుండా ఎంతో అంకితభావంతో ఉద్యమాన్ని ముందు ఉండి నడిపారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా బీసీలు లబ్ధి పొందలేదు, చివరికి కులవృత్తులకు కూడా చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు అందలేదని ఆయా కులాలకు చెందిన వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హలో బీసీ ఛలో ఢిల్లీ, ఛలో రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని అంటూ ఇలా బీసీ ఉద్యమాలు నడిపిన మహనీయులు లేకపోలేదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాని చెప్పుకోదగ్గ లాభాలు పొందలేని వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ సామాజిక వర్గం. వీరి అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొంది.

ప్రత్యేక రాష్ట్రంలోనూ అన్యాయమే

దాదాపు రెండు దశాబ్దాల కాలంలో బీసీలు ఎందరికో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆత్మబలిదానాలకు సైతం వెనుకాడకుండా ఎంతో అంకితభావంతో ఉద్యమాన్ని ముందు ఉండి నడిపి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ద్వారా బీసీలు కనీసం కుల సంఘాల వారీగా కూడా పెద్దగా లబ్ధి పొందలేదని, చివరికి కులవృత్తులకు కూడా చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు కూడా అందలేదని ఆయా కులాలకు చెందిన సామాజిక మాధ్యమాల్లో వారు వారి బాధ వ్యక్తం చేస్తున్నారు. మేం కుల సంఘం నాయకులం అని చెప్పుకుంటూ జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులతో గానీ, అధికారులతో గానీ ప్రత్యక్షంగా కలిసి తమ కులం సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపలేని, తమ సొంత కులానికి ఏమి చేయలేని నాయకుల నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు కోకొల్లలు.

ముందు ఈ లెక్కలు తేల్చాలి..!

ఇది ఇలా ఉంటే, కులం పేరు, కుల సంఘం పేరు చెప్పుకొని ప్రభుత్వం దగ్గర కుల సంఘాల కోసం ఏ భూములు తీసుకొచ్చారో.. ఆ భూములను దశాబ్దాలు గడిచినా అభివృద్ధి పర్చకపోగా భూముల గురించి మాట్లాడే సాటి కులస్తులను పట్టుకొని నువ్వెవరూ.. కుల సంఘం స్థలాల గురించి నీకేం హక్కు ఉందని కుట్రలకు తెర లేపేవారు లేకపోలేదు. ఇలా తప్పును ఎదిరించలేక మంచిని సమర్థించలేక బీసీ కుల సంఘాల్లోని సభ్యులు ఎంతో వెనుకబాటుకు గురవుతున్నారు. కాబట్టి ముందుగా బీసీ కుల గణన చేయడం కంటే, ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఉమ్మడి జిల్లాల వారీగా చిన్న జిల్లాల వారీగా ప్రభుత్వం దగ్గర కుల సంఘాల పేర్లు చెప్పి తీసుకువచ్చిన స్థలాలు ఎన్ని, నిధులు ఎంత ఇవన్నీ లెక్కలు తేల్చి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

సింగోజు మురళీ కృష్ణ ఆచార్యులు,

జర్నలిస్ట్

99850 21041

Tags:    

Similar News