సిద్దిపేట సమగ్ర స్వరూపం
సిద్దిపేట సమగ్ర స్వరూపం... book releasing with complete history of siddipet district by harish rao
గ్రంథాన్ని రూపొందించడానికి సిద్ధిపేటకు చెందిన ప్రముఖ రచయిత కొండి మల్లారెడ్డి కన్వీనర్‌గా తొమ్మిది మంది సభ్యులతో కోర్ కమిటీ ఏర్పాటు చేసింది. జిల్లా భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకుని, ఆపరిధిలోని చరిత్రను, సంస్కృతిని, సాహిత్యంలోని బిన్న ప్రక్రియలను, కళలు, సాహిత్య కళారూపాలు, పర్యాటక ప్రదేశాలు, జాతరలు, ఉద్యమాలు, త్యాగమూర్తులు, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల ప్రగతి, సాగునీటి వ్యవస్థ, ప్రాజెక్టులు, తదితర అంశాలపై పరిశోధనాత్మక వ్యాసాలను పొందుపరిచి ఈ గ్రంథాన్ని రూపొందింది. 450 పేజీలు గల ఈ గ్రంథాన్ని 40 మంది రచయితలు నాలుగు నెలలపాటు పరిశోధించి సమగ్రంగా రూపొందించారు.
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో, గతంలో ఉమ్మడి రాష్ట్రం పేరు మీద ఉన్న సంస్థలన్నీ తెలంగాణ పేరు మీద స్థిరపరుచుకున్నాయి. 2015 ఆగస్టు 30 వరకు 'ఆంధ్ర సారస్వత పరిషత్'గా ఉన్న సాహితీ సంస్థ 'తెలంగాణ సారస్వత పరిషత్'గా మారింది. ఈ సంస్థ సాహిత్య, సాంస్కృతిక, కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ మధ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా జిల్లాల సమగ్ర స్వరూపాన్ని పుస్తక రూపంగా వెలువరిస్తున్నది. విలువలతో కూడిన సాంస్కృతిక దృక్పథాన్ని సాహిత్యం ద్వారా అందజేయాలని, ఒక జిల్లాకు సంబంధించిన వారు వేరొకరి గురించి చెప్పడం కంటే, ఆయా జిల్లాలకు చెందిన సాహిత్యకారులే తమ జిల్లా గురించి సమగ్ర చరిత్ర రూపొందించుకునే విధంగా 33 జిల్లాలలో సాంస్కృతిక కథనాలను రూపొందించింది.
ఇందులో భాగంగా 'సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం' అనే గ్రంథాన్ని రూపొందించడానికి సిద్ధిపేటకు చెందిన ప్రముఖ రచయిత కొండి మల్లారెడ్డి కన్వీనర్‌గా తొమ్మిది మంది సభ్యులతో కోర్ కమిటీ ఏర్పాటు చేసింది. జిల్లా భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకుని, ఆ పరిధిలోని చరిత్రను, సంస్కృతిని, సాహిత్యంలోని బిన్న ప్రక్రియలను, కళలు, సాహిత్య కళారూపాలు, పర్యాటక ప్రదేశాలు, జాతరలు, ఉద్యమాలు, త్యాగమూర్తులు, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల ప్రగతి, సాగునీటి వ్యవస్థ, ప్రాజెక్టులు, తదితర అంశాలపై పరిశోధనాత్మక వ్యాసాలను పొందుపరిచి ఈ గ్రంథాన్ని రూపొందింది. 450 పేజీలు గల ఈ గ్రంథాన్ని 40 మంది రచయితలు నాలుగు నెలలపాటు పరిశోధించి సమగ్రంగా రూపొందించారు.
రంగధాంపల్లి అమరవీరుల స్థూపం ముఖం చిత్రంతో ఆకర్షణీయంగా రూపొందించబడిన ఈ గ్రంథం సిద్ధిపేట జిల్లా విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. 8 డిసెంబర్ 2022 గురువారం సాయంత్రం 5.30కు సిద్ధిపేట విపంచి కళా నిలయంలో తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(minister harish rao) గారి చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఆచార్య యెల్లారి శివారెడ్డి, డా. జి.చెన్నయ్య, కొండి మల్లారెడ్డి ప్రసంగిస్తారు. సిద్ధిపేట జిల్లా, విద్య, వైద్యం, వ్యవసాయ, వ్యాపార, సాగునీటి, సాహిత్య, సాంస్కృతిక కళారంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ గ్రంథంలో పొందుపరచబడింది. ఈ గ్రంథం భావితరాలకు, పరిశోధకులకు, పోటీ పరీక్షార్థులకు, విద్యార్థులకు, ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
చిటుకుల మైసారెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
సిద్దిపేట, 94905 24724