భూంకాల్ తిరుగుబాటు యోధుడు

స్వాతంత్రోద్యమ ప్రభావానికి ముందే గ్రామీణ ప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన పట్ల వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది

Update: 2022-03-25 18:45 GMT

ఈ ఘటనకు వ్యతిరేకంగా లాల్ దైనిక్ భాస్కర్, కళేంద్రసింగ్, మరియా, ధుర్వ తెగలను ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం చేశారు. దీని నాయకత్వాన్ని మరియా తెగ పెద్ద బిర్సిన్హ్ బేదర్ గుండా ధుర్‌కు అప్పగించాడు. ఈ తిరుగుబాటే భూంకాల్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. గుండా ధుర్ మామిడి కొమ్మకు ఎర్ర మిరపకాయలు కట్టి 'దార-మిరి' తయారుచేశాడు. దీంతోపాటు అతడి బాకు బస్తర్ అంతటా తిప్పబడింది. ఆయన ఎక్కడికి వెళ్లినా మద్దతుగా జనం గుమిగూడేవారు. దేవదూత రాకలాగా స్వాగతం పలికేవారు. అలసిపోని అతని ధైర్య సాహసాలు నలుదిశలా వ్యాపించాయి.

స్వాతంత్రోద్యమ ప్రభావానికి ముందే గ్రామీణ ప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన పట్ల వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం. బ్రిటిష్‌వారి మర ఫిరంగులు, తుపాకి తూటాల ముందు ఆదివాసీల విల్లులు సరిపోకపోయినా మొక్కవోని ఆత్మస్థయిర్యంతో వారు బ్రిటిష్ అధికారులను నిలువరించారు. అలాంటి వారిలో ముఖ్య విప్లవకారుడు గుండా ధుర్. బ్రిటిష్‌ పెత్తనాలను ప్రతిఘటించి పోరాడుతూ వేల మంది గిరిజనులు అమరులయినారు.

వందల మందిని రాజద్రోహం పేరుతో జీవిత ఖైదీలుగా జైలు పాలయ్యారు. కిక్కిరిసిన జైలులో స్థలం సరిపోక కొరడా దెబ్బలు కూడా తిన్నారు. అంతటి తిరుగుబాటుకు బస్తర్ జిల్లా నేతనార్ గ్రామానికి చెందిన గుండా ధుర్ నాయకత్వం వహించారు. బస్తర్‌లోని కంగేర్ ఫారెస్ట్ దుర్వాస్ ఆయన తిరుగుబాటు స్థావరం. ధుర్వా తెగ ఆదివాసీల ఆరాధ్య నాయకుడైన షహిద్ గుండా ధుర్ 1910లో బస్తర్‌ స్థానిక రాజు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన తిరుగుబాటుకు దారులు వేశారు.

అణచివేతను తట్టుకోలేక

గిరిజనుల మీద తెల్లదొరలు సాగిస్తున్న అణచివేతనే వారిని ఉద్యమం వైపు మళ్లించింది. దీనినే మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అంటారు. 'ది 'భూమ్‌కల్ మూవ్‌మెంట్'గా పిలుచుకుంటారు. ఈ ఉద్యమంలో తిరుగుబాటు సందేశాలను వ్యాప్తి చేయడానికి 'లాల్ మిర్చ్-ఆమ్ కీ చట్నీ' అనే నినాదాన్ని వాడుకున్నారు. దీనిని 'దారా-మిరి' అని పిలుచుకునేవారు. గుండాధుర్ గురించి ఇప్పటికీ పురాణ గాథలు ఉన్నాయి. అతను అద్భుత మహిమ శక్తులను కలిగి ఉన్నాడని, వాటితోనే బ్రిటిష్‌వారి మీదకు నీటి బుల్లెట్లను తయారు చేసేవాడని నమ్ముతారు. 'సూపర్‌హీరో' చిత్రంతో ఈ గిరిజన దేశభక్తుడు 'రాబిన్‌హుడ్ ఆఫ్ బస్తర్' అయిపోయాడు.

భూంకాల్ తిరుగుబాటును తొమ్మిదిసార్లు అణచివేయడంతో గిరిజనులు అసంతృప్తితో ఉన్నారు. 1891లో బ్రిటిష్ ప్రభుత్వం బస్తర్‌ను స్వాధీనపరచుకరుంది. రాజు రుద్ర ప్రతాప్‌దేవ్ మామ లాల్ కళేంద్ర సింగ్‌ను దివాన్ పదవి నుండి తొలగించింది. పాండా బైజ్‌నాథ్‌ను పరిపాలకుడుగా నియమించింది. ఇది గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. జగదల్‌పూర్‌ అభివృద్ధి సమయంలో గిరిజనులను బ్రిటిష్‌వారు అణిచివేసారు. నిర్బంధ విద్య పేరుతో గిరిజన పిల్లలను బలవంతంగా పాఠశాలకు తెచ్చారు. సురక్షిత అడవి, ఆదివాసీలకు స్వంత భూమి లేకుండా చేశారు. గిరిజనులను క్రూరంగా కొట్టి జైలులోకి నెట్టివేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు. జల్-జంగల్-జమీన్ నుంచి దూరం చేశారు. ఇదే వారిని రెచ్చగొట్టింది.

దేవదూతతో సమానంగా

ఈ ఘటనకు వ్యతిరేకంగా లాల్ దైనిక్ భాస్కర్, కళేంద్రసింగ్, మరియా, ధుర్వ తెగలను ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం చేశారు. దీని నాయకత్వాన్ని మరియా తెగ పెద్ద బిర్సిన్హ్ బేదర్ గుండా ధుర్‌కు అప్పగించాడు. ఈ తిరుగుబాటే భూంకాల్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. గుండా ధుర్ మామిడి కొమ్మకు ఎర్ర మిరపకాయలు కట్టి 'దార-మిరి' తయారుచేశాడు. దీంతోపాటు అతడి బాకు బస్తర్ అంతటా తిప్పబడింది. ఆయన ఎక్కడికి వెళ్లినా మద్దతుగా జనం గుమిగూడేవారు. దేవదూత రాకలాగా స్వాగతం పలికేవారు. అలసిపోని అతని ధైర్య సాహసాలు నలుదిశలా వ్యాపించాయి. బ్రిటిష్‌వారు తుపాకీతో కాల్చినప్పుడు తన అద్భుత శక్తులతో బుల్లెట్ వాటర్‌తో ఎదుర్కొంటాడు.

1910 ఫిబ్రవరి 2 న ప్రారంభమైన తిరుగుబాటు కేవలం ఎమిమిది రోజులలోనే ఉధృతంగా మారింది. దీంతో రాజు సెంట్రల్ ప్రావిన్సెస్ కమిషనర్‌కు టెలిగ్రామ్ పంపి తక్షణ సహాయం కోరారు. వెంటనే అక్కడ నుంచి సెంట్రల్ ప్రావిన్స్‌లకు చెందిన 200 మంది సైనికులు, మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన 150 మంది సైనికులు, పంజాబ్ బెటాలియన్‌కు చెందిన 170 మంది సైనికులను పంపించారు. 75 రోజుల పాటు తిరుగుబాటుదారులు, సాధారణ గిరిజనులు విధ్వంసం సృష్టించారు. సంప్రదాయ బాణాలు ప్రయోగించారు. గూండా ధుర్ అదృశ్యమయ్యాడు. చివరకు ఈ యుద్ధం 1910 ఫిబ్రవరి 16న ఇంద్రావతి నదిపై ఖడగ్ ఘాట్ వద్ద ముగిసింది. కొందరు గిరిజనులతో పాటు గుండాధుర్‌ ప్రాణాలు కోల్పోయారు. 1912 లో మళ్లీ భూపోరాటం జరిగినట్లు కొందరి వాదన. చరిత్రలో మాంత్రం భూంకాల్ తిరుగుబాటు సుస్థిర స్థానం నిలబెట్టుకుంది.

                ( నేడు గుండా ధుర్ వర్థంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

94913 18409

Tags:    

Similar News