భౌతిక శాస్త్ర దిగ్గజం

A giant in physics Albert Einstein

Update: 2024-03-14 00:30 GMT

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావంతమైన భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరు. తన పరిశోధనలు విశ్వం గురించి మన అవగాహనే మార్చివేశాయి. ఆయన విజయం సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించమని చెప్పిన శాస్త్రజ్ఞుడు, శాంతియుతవాది.

జర్మనీలోని ఉల్మ్‌లో ఒక యూదు కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే భౌతిక శాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యి, స్వట్జర్లాండ్‌లోని జ్యూరీచ్‌లో ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన డాక్టరల్ పరిశోధన కాంతి విద్యుత్ ప్రభావం పై ఆధారపడింది. 1905లో, యాదృచ్ఛిక కదలికల సిద్ధాంతంతో సహా నాలుగు విప్లవాత్మక పరిశోధనా పత్రాలను ప్రచురించాడు.

గురుత్వాకర్షణ ద్వారా

1915లో, సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు, ఇది గురుత్వాకర్షణను ఒక కొత్త మార్గంలో వివరించింది. 1921లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 1933లో నాజీ పాలన నుండి తప్పించుకొని అమెరికాకి వలస వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అణుబాంబు అభివృద్ధిలో పాల్గొన్నారు. యుద్ధానంతరం అణ్వాయుధాల ప్రమాదాల గురించి హెచ్చరించాడు. ఐన్‌స్టీన్ ముఖ్య సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం. స్థలం, కాలం స్థిరమైనవి కావు, అవి కదలిక, గురుత్వాకర్షణ ద్వారా ప్రభావితమవుతాయని చెబుతుంది. ద్రవ్యరాశి-శక్తి సమతుల్యత. ఐన్‌స్టీన్ E=mc^2 అనే సూత్రాన్ని కూడా రూపొందించాడు. ఇక్కడ E శక్తి, m ద్రవ్యరాశి, c కాంతి వేగం. ద్రవ్యరాశి, శక్తి ఒకదానితో ఒకటి మార్చబడతాయని చెప్పేన ఈ సూత్రం అణుశక్తి అభివృద్ధికి దారితీసింది. ఈ సమీకరణం ద్రవ్యరాశి, శక్తి ఒకదానితో ఒకటి మార్చబడతాయని చూపిస్తుంది. బ్రౌనియన్ కదలిక. ఈ సిద్ధాంతం ద్రవాలలో తేలియాడే చిన్న కణాలు యాదృచ్ఛికంగా కదులుతాయని వివరిస్తుంది. కాంతి విద్యుత్ ప్రభావం. ఈ దృగ్విషయం కాంతిలోని కణ తరంగాల ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది.

అవగాహన విస్తరించిన శోధన

ఐన్‌స్టీన్ పరిశోధనలు భౌతిక శాస్త్రాన్ని మార్చాయి. విశ్వం గురించి మన అవగాహనను విస్తరించాయి. అతను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డారు. ఆయన సిద్ధాంతాలు GPS, న్యూక్లియర్ పవర్, లాసర్‌లు వంటి అనేక ఆధునిక సాంకేతికతల అభివృద్ధికి దారితీశాయి. ఐన్‌స్టీన్ ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక మానవతావాది కూడా. శాంతి, అంతర్జాతీయ సహకారానికి మద్దతు ఇచ్చాడు. అతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక వ్యక్తి. ఐన్‌స్టీన్ 1955 ఏప్రిల్ 18, ప్రిన్స్‌టన్‌లో మరణించాడు. ఐన్‌స్టీన్ మరణానంతరం కూడా చరిత్ర సృష్టించాడు. తన మెదడు మీద ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రపంచంలో అత్యంత మేధావి, అత్యంత జ్ఞాపక శక్తి గలవాడు, అంతేకాకుండా మతిమరుపు కలవాడు కూడా అయినప్పటికీ తనకున్న గణిత శాస్త్ర సైన్స్ మీద ఉన్న ఆసక్తితో నిరంతరం సాధన చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తగా ఎదిగాడు. తనకున్న సిద్ధాంతాలను శాస్త్ర పరిశోధనలను నియమ నిబంధనలతో సాధించి ప్రపంచానికి అత్యున్నతమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించిన ఐన్‌స్టీన్‌ను. ప్రపంచం ఎన్నటికీ మరువదు.

(నేడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జయంతి)

గుడేపు పిచ్చయ్య

భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు

98851 76548

Tags:    

Similar News