గని కార్మికులకు వెలుగేది?

6 guarantees schemes should be provided to Singareni retired workers

Update: 2024-02-11 00:30 GMT

గతంలో సింగరేణిలో పని చేసిన కార్మికులు నేడు బొగ్గు పింఛన్ దారులుగా జీవిస్తున్నారు. ఇట్టి పెన్షన్ దారులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్ లభించడం లేదు. కోల్ మైన్స్ పెన్షన్ అనేది కార్మికుని వాటాతో యాజమాన్య వాటాతో కూడుకున్న స్వచ్చంధ పథకం మాత్రమే. ఇవి ఉన్నాయని ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు మమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. అందుకే రేషన్ కార్డు కోసం గత 10 సంవత్సరాల క్రితం పొందుపరచిన ఆర్థిక పరిమితి సవరించాలి.

గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా నేటి ప్రజా ప్రభుత్వం సింగరేణి విశ్రాంత కార్మికుల త్యాగాలు గుర్తించి వారికి తెల్ల రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ పథకంకు సంబంధం లేకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం, సింగరేణి విశ్రాంత కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఉచిత గృహ వసతి లాంటివి వర్తింపజేయాలి. ప్రతి సంవత్సరం ఉత్పత్తి, ఉత్పాదక వృద్ధి రేటులో అగ్రగామిగా ఉన్న సింగరేణి సంస్థ అభివృద్ధికి సింగరేణి కార్మికుల శ్రమనే మూల పెట్టుబడి. బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా అధిక ఉష్ణోగ్రతలో పని చేసిన రిటైర్డ్ కార్మికుల జీవితాల్లో వెలుగు చూడటం లేదు. పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ నాటికైనా సింగరేణి విశ్రాంతి కార్మికులను తగు ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నాం.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Tags:    

Similar News