బండి సంజయ్ కంప్లైట్.. గ్రానైట్ కంపెనీలకు ఈడీ షాక్

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ మీదుగా కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. దీంతో విదేశాలకు ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ గ్రానైట్, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీఏ ఎనర్జీ, అరవింద్, […]

Update: 2021-08-03 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ మీదుగా కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. దీంతో విదేశాలకు ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ గ్రానైట్, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీఏ ఎనర్జీ, అరవింద్, శాండియా ఏజెన్సీస్, పీఎస్‌ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Tags:    

Similar News