వ్యవసాయంతోనే ఆర్థికాభివృద్ధి: నిరంజన్ రెడ్డి
దిశ, మహబూబాబాద్ : వ్యవసాయం బాగుంటేనే అన్ని రంగాలు బలోపేతమై ఆర్థికాభి వృద్ధి సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం బొద్దుగొండ, మహబూబాబాద్ మండల ఏటిగడ్డ తండా రైతు వేదికలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, గిరిజన శాఖామంత్రి శ్రీమతి సత్యవతిలు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 7 వరకు 6వ […]
దిశ, మహబూబాబాద్ : వ్యవసాయం బాగుంటేనే అన్ని రంగాలు బలోపేతమై ఆర్థికాభి వృద్ధి సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం బొద్దుగొండ, మహబూబాబాద్ మండల ఏటిగడ్డ తండా రైతు వేదికలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, గిరిజన శాఖామంత్రి శ్రీమతి సత్యవతిలు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు.
ఈ నెల 27 నుంచి జనవరి 7 వరకు 6వ విడత రైతు బంధుకు గాను 59లక్షల రైతు ఖాతాదారులకు 7వేల 300కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ర్త గిరిజన సంక్షేమ శాఖామంత్రి మాట్లాడుతూ… రైతు వేదికలు రైతు ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు.. కోవిడ్ సమయంలో కూడా కోట్ల అప్పుతెచ్చి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు.