గుంటూరు GGH లో దారుణం.. ఈసీజీ పేరుతో అమ్మాయి ఒంటిపై వస్త్రాలు తీయించి..

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈసీజీ తీయించుకునేందుకు వెళ్లిన యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడో వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే ఓ 19 ఏళ్ల యువతికి గత కొద్ది రోజులుగా ఛాతి వద్ద నొప్పి వస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దాంతో యువతి ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న ఈసీజీ సెంటర్‌కు వెళ్లి వైద్యులు ఇచ్చిన చిటీని […]

Update: 2021-11-13 04:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈసీజీ తీయించుకునేందుకు వెళ్లిన యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడో వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే ఓ 19 ఏళ్ల యువతికి గత కొద్ది రోజులుగా ఛాతి వద్ద నొప్పి వస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దాంతో యువతి ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న ఈసీజీ సెంటర్‌కు వెళ్లి వైద్యులు ఇచ్చిన చిటీని చూపించింది. అయితే పరీక్షలు చేసే హరీష్ అనే వ్యక్తి ఆమెను లోపలికి తీసుకెళ్లి వస్త్రాలు తొలగించాలని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. వస్త్రాలు తీయకపోతే ఈసీజీ సరిగా తీయలేమని.. సమస్య ఏమిటో రిపోర్టులో సరిగ్గా రావాలంటే వస్త్రాలు తీయాలని ఒత్తిడికి గురి చేశాడు.

త్వరగా తీయించుకుంటావా లేదా.. బయట చాలా మంది ఉన్నారు అంటూ హడావిడి చేశాడు. ఆ యువతి చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించేలా చేశాడు. అక్కడ ఉన్న బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాదు యువతిని కళ్లు మూసుకోవాలని చెప్పి తన ఫోన్‌లో యువతిని నగ్నంగా చిత్రీకరిస్తుండగా గమనించిన యువతి వెంటనే ప్రతిఘటించింది. ఈసీజీ రూమ్‌ నుండి బయటకి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి విలపించింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి అతడిని నిలదీశాడు. అయినా తానేం అలా ప్రవర్తించలేదని టెక్నీషియన్ బుకాయించాడు. ఫోన్‌ ఇవ్వాలని అడగగా అతడు ఎదురుతిరగాడు.

దాంతో యువతి తండ్రి పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈసీజీ తీసే శంకర్‌ అనే ఉద్యోగి గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని విచారించగా హరీష్‌ ఎవరో తనకు తెలియదని శంకర్‌ చెప్పాడు. ఈసీజీ టెక్నీషియన్‌గా ట్రైనింగ్‌ పొందుతున్న విద్యార్థిని విధుల్లో ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఆ విద్యార్థే హరీష్‌ను తీసుకొచ్చి ఈసీజీలు తీయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News