నాడు ఆ లేఖ నేడు ఈ లేఖ.. కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, వీణవంక: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాము గెలవలేమనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ… గతంలో కేసీఆర్‌కు లొంగిపోయినట్లు ఒక లేఖ సృష్టించారని, అది ఎవరు రాశారో తేల్చాలని హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు బయటకు రాలేదన్నారు. ఇప్పుడు దళితబంధు వద్దని తాను రాసినట్టుగా మరో లేఖ పుట్టించారని ఆరోపించారు. ఈ లేఖను ఎవరు […]
దిశ, వీణవంక: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాము గెలవలేమనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ… గతంలో కేసీఆర్‌కు లొంగిపోయినట్లు ఒక లేఖ సృష్టించారని, అది ఎవరు రాశారో తేల్చాలని హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు బయటకు రాలేదన్నారు. ఇప్పుడు దళితబంధు వద్దని తాను రాసినట్టుగా మరో లేఖ పుట్టించారని ఆరోపించారు. ఈ లేఖను ఎవరు సృష్టించారో తేలాల్సిందేనని ఈటల డిమాండ్ చేశారు. రాజీనామా చేసి కూడా నా పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకు గర్వ పడుతున్నానన్నారు.
తనను పార్టీలో నుండి పొమ్మనలేక కేసీఆర్ పొగ పెట్టిండన్నారు. నేను ఎప్పుడన్నా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించానో చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు కుడి, ఎడమ భుజమని,
చివరికి నాకు కూడా జీతం ఇచ్చేదీ ఈటల అని కేసీఆర్ చెప్పిండా ? లేదా? అని ప్రశ్నించారు. వీడు రోజు రోజుకు గట్టిగా అయితుండు అని కేసీఆర్‌కు కోపం వచ్చిందన్నారు. సమైఖ్య పాలనలో ఆనాటి ముఖ్యమంత్రులు నా భూమి లాక్కున్నా నేను తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నానని భూమి కోసం ఉద్యమాన్ని వదిలేయలేదని ఈటల అన్నారు.
నాతో కలిసి పనిచేసిన హరీష్ రావు కొత్త అవతారం ఎత్తాడని, పదవులు ఇచ్చినా అంటున్నాడని మండిపడ్డారు. నాకు చేతకాకపోతేనే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మంత్రి పదవి ఇచ్చారా..? నాలో దమ్ముంది కాబట్టే పదవులు ఇచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.