కేసీఆర్.. తెలంగాణ మీ అబ్బ జాగీరు కాదు.. గర్జించిన ఈటల
దిశ, కమలాపూర్ : నన్ను ఓడించేందుకు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు అడ్డాపెట్టి, కుల సంఘాల నాయకులతో మీటింగ్‌లు పెట్టి విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. బీజేపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారని, సంక్షేమ పథకాలు రావని చెప్పడానికి ఇది మీ అబ్బ జాగీరు కాదంటూ తీవ్రస్థాయిలో టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మాజీ […]
దిశ, కమలాపూర్ : నన్ను ఓడించేందుకు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు అడ్డాపెట్టి, కుల సంఘాల నాయకులతో మీటింగ్‌లు పెట్టి విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. బీజేపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారని, సంక్షేమ పథకాలు రావని చెప్పడానికి ఇది మీ అబ్బ జాగీరు కాదంటూ తీవ్రస్థాయిలో టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు.
కేసీఆర్ డబ్బులు, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నాడని, తనకు ఎవరు ఉపయోగ పడకపోయినా కానీ పార్టీకి, ఉద్యమానికి ఎంతో సేవ చేశానని అన్నారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితులు చూస్తుంటే నిజాం సర్కార్ పరిపాలన గుర్తుకు వస్తోందని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రేమకు లొంగుతారు కానీ బెదిరింపులకు కాదన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక్కడికి వచ్చే మంత్రులు గతంలో ఎంతగా బాధపడ్డారో నాతో ఎలా మీ బాధలు పంచుకున్నారో మీకు, నాకు తెలుసంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
కొందరు నాయకులు రాజేందర్‌కు పదవులు, గౌరవం ఇచ్చామని చెబుతున్నారు కానీ, నాకు ఏ పదవి ఇచ్చినా ఒళ్లు వంచి పని చేశానని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గం వచ్చి సంక్షేమ పథకాలు, పెండింగ్ బిల్లులు ఎలా ఇస్తామంటున్నారో మీ నియోజకవర్గాల్లో, జిల్లాలో కూడా సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. గతంలో జరిగిన హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికలలో అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ పథకాలు రావని చెప్పడానికి ఇది మీ అబ్బ జాగీరు కాదని ఈటెల హెచ్చరించారు. గతంలో 2018 హుజురాబాద్ ఎన్నికల లో ఈటల రాజేందర్‌ను ఓడగొట్టాలని ఎదుటి వారికి డబ్బులు ఇచ్చి కొన్ని సంస్థలను సృష్టించి కరపత్రాలు పంచారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో గెలిచాక మా ఇద్దరి కోరలు పీకాలనే మంత్రి పదవులు ఇవ్వలేదని, హుజురాబాద్ గడ్డ మీద జెండా ఓనర్లమని ఆక్రోశం వెళ్లగక్కిన తర్వాతనే మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గాని, ఆత్మగౌరవాన్ని కోల్పోతే భరించరని అన్నారు. ఇది ఒక్క హుజురాబాద్‌కే పరిమితమైన ఎన్నిక కాదని, యావత్ తెలంగాణాపై ప్రభావం చూపే ఎన్నికలని తెలిపారు. తన గెలుపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపని, రాబోయే 2023 ఎన్నికలకు ఇది రిహార్సల్ లాంటిదని అన్నారు.
2023లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు . అనంతరం రేపు ప్రారంభం కాబోయే పాదయాత్ర నియోజకవర్గంలో 23 రోజుల పాటు కొనసాగుతుందని, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.