ప్రభుత్వానికి సవాల్.. హైకోర్టులో ఈటల భార్య పిటిషన్
దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం హైకోర్టుకెక్కింది. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈటల రాజేందర్సతీమణి జమునా, కుమారుడు నితిన్‌రెడ్డి పిటిషన్ వేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని, తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులు పెట్టారని జమునా హేచరీస్ తరుఫున కోర్టుకు విన్నవించారు. తమ భూముల్లో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా చూడాలని, ఇప్పటికీ పోలీసుల బందోబస్తుతో […]
దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం హైకోర్టుకెక్కింది. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈటల రాజేందర్సతీమణి జమునా, కుమారుడు నితిన్‌రెడ్డి పిటిషన్ వేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని, తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులు పెట్టారని జమునా హేచరీస్ తరుఫున కోర్టుకు విన్నవించారు. తమ భూముల్లో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా చూడాలని, ఇప్పటికీ పోలీసుల బందోబస్తుతో భయపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, బలవంతంగా చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్ విభాగం, మెదక్ కలెక్టర్‌ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ భూములకు సంబంధించిన పలు ధృవీకరణ పత్రాలను సైతం కోర్టుకు దాఖలు చేశారు.