బిగ్ న్యూస్… కేబినెట్ నుంచి ఈటల బర్తరఫ్..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆదివారం సాయంత్రం ఫైల్‌ను పంపించారు. అసైన్మెంట్ భూ కబ్జా వ్యవహారంలోనే ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఫైల్లో నివేదించారు. ఆదివారం పూర్తిస్థాయి నివేదికను మెదక్ కలెక్టర్… సీఎస్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. నివేదిక ఫైల్‌ను మధ్యాహ్నం ప్రభుత్వం తరపున బయటకు విడుదల చేశారు. అసైన్మెంట్ భూమి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆదివారం సాయంత్రం ఫైల్‌ను పంపించారు. అసైన్మెంట్ భూ కబ్జా వ్యవహారంలోనే ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఫైల్లో నివేదించారు.
ఆదివారం పూర్తిస్థాయి నివేదికను మెదక్ కలెక్టర్… సీఎస్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. నివేదిక ఫైల్‌ను మధ్యాహ్నం ప్రభుత్వం తరపున బయటకు విడుదల చేశారు. అసైన్మెంట్ భూమి 66 ఎకరాలను కబ్జా చేసినట్లు నివేదికలో వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ ఆ ఫైల్‌పై ఆమోదముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా ఈటల రాజేందర్ బర్తరఫ్‌ను ప్రకటించింది.