తూ.గో. జిల్లాలో చీమలు కూడా కదలట్లేదు!

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ఆ స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రెండో జిల్లా తూర్పుగోదావరి జిల్లా కావడం విశేషం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 5,564 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం కఠిన కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. ఆదివారం సెలవు కావడంతో అత్యవసర సర్వీసులు […]

Update: 2020-07-19 01:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ఆ స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రెండో జిల్లా తూర్పుగోదావరి జిల్లా కావడం విశేషం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 5,564 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం కఠిన కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది.

ఆదివారం సెలవు కావడంతో అత్యవసర సర్వీసులు మినహా ఇతర ఏ రకమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు లేదని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ప్యూ విధిస్తున్నామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఎపిడమిక్ డిసీజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో జిల్లా మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే బడితెపూజ చేస్తున్నారు. అయితే కరోనాపై అవగాహన కలగడంతో బయటకు వచ్చేందుకు స్థానికులు కూడా వెనకడుగు వేస్తున్నారు.

Tags:    

Similar News