సహారా ఎడారిలో 1.8 బిలియన్ చెట్లు..తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: సహారా ఎడారి మొత్తం ఇసుకతో వ్యాపించి ఉంటుందని, చాలా తక్కువ చెట్లు ఉంటాయని అనుకుంటాం. కానీ, శాటిలైట్ ఇమేజెస్, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సహారా ఎడారిలో వృక్షాల సంఖ్యను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎడారి వ్యాప్తంగా దాదాపు 180 కోట్ల వృక్షాలు ఉన్నట్లు తేలింది. సహారా ఎడారిలోని చాలా ప్రాంతాల్లో అసలు చెట్లు ఏమీ లేవు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా చెట్లు ఉన్నాయని కొపెన్‌హెగెన్ యూనివర్సిటీ జియోగ్రఫి అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాండ్ […]

Update: 2020-10-16 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: సహారా ఎడారి మొత్తం ఇసుకతో వ్యాపించి ఉంటుందని, చాలా తక్కువ చెట్లు ఉంటాయని అనుకుంటాం. కానీ, శాటిలైట్ ఇమేజెస్, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సహారా ఎడారిలో వృక్షాల సంఖ్యను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎడారి వ్యాప్తంగా దాదాపు 180 కోట్ల వృక్షాలు ఉన్నట్లు తేలింది.

సహారా ఎడారిలోని చాలా ప్రాంతాల్లో అసలు చెట్లు ఏమీ లేవు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా చెట్లు ఉన్నాయని కొపెన్‌హెగెన్ యూనివర్సిటీ జియోగ్రఫి అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాండ్ తెలిపారు. అవి కొన్ని జంతువులకు నివాసాలు, ఆహార వనరులుగానూ ఉంటున్నాయని అన్నారు. మార్టిన్ బ్రాండ్, అతని బృందం కలిసి హై రిసొల్యూషన్ సెన్సింగ్ డేటాతో శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ రికగ్నిషన్ అల్గారిథమ్ ఉపయోగించి వృక్షాల సంఖ్యను తేల్చారు. వెస్టర్న్ సహారా , సాహెల్, సుదానియన్ జోన్‌లలో చాలావరకూ చెట్లు ఉన్నాయి. మొత్తంగా అవి దాదాపు 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్నాయి. అలా మొత్తంగా 1.8 బిలియన్ చెట్లు (180 కోట్లు ) ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనకుగానూ 11 వేలకు పైగా ఇమేజెస్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ‘డీప్ లెర్నింగ్‌లో భాగంగా మేం చెట్లు ఎలా కనిపిస్తాయనేది అల్గారిథంలో ముందుగానే సేవ్ చేసి ఉంచాం. చెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోగలిగాం. చెట్లకు బదులుగా, ఇళ్లు, కార్లు, ఆవులు ఏమున్నా సరే తెలుసుకోగలం. ఇదంతా చాలా ఖరీదైన శాటిలైట్ ఇమేజింగ్ టెక్నిక్‌తోనే సాధ్యపడింది’ అని మార్టిన్ బ్రాండ్ అన్నారు. సహారా ఎడారిలోని చెట్లను కాలిక్యులేట్ చేయడానికి లక్షలాది మంది మనుషులు, సంవత్సరాల పని గంటలు అవసరం అయ్యేవని, కానీ, కొన్ని గంటల్లోనే తాము ఈ పని పూర్తి చేశామని బ్రాండ్ చెప్పారు.

Tags:    

Similar News