టర్కీ, గ్రీస్ లలో భారీ భూకంపం..
దిశ, వెబ్ డెస్క్: టర్కీ, గ్రీస్ లలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్రంలో కొద్దిపాటి సునామీ వచ్చింది. దీంతో ఇజ్మీర్ తీర ప్రాంతంలోకి సముద్రనీరు చొచ్చుకు వచ్చింది. కాగా భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్రీస్ ద్వీపం సామోస్ కు సమీపంలో 16.5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు.