వికారాబాద్‌లో కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన జనం
దిశ, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో మరోసారి భూమి కంపించినట్టు తెలుస్తోంది. బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి, బొపునారం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామాల్లో భూమి కంపించడంతో ఆ గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నం 2.10 గంటల ఆరు సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కుపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారు. గత నెల […]
దిశ, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో మరోసారి భూమి కంపించినట్టు తెలుస్తోంది. బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి, బొపునారం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామాల్లో భూమి కంపించడంతో ఆ గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నం 2.10 గంటల ఆరు సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కుపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారు.
గత నెల రోజుల కిందట తొర్మామిడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి తాలుకాలోని కర్కిచెడ్ గ్రామంలో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మళ్లీ అదే సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించడం, ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలను మరింత భయానికి గురిచేస్తుంది. అయితే, ఎంతమేర భూమి కంపించింది. ఎందుకు కంపిస్తుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పలువురు ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.