తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కాలేజీ ప్రవేశాల కోసం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం ప్రకటించారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్ష (EAMCET) జులై 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే JNTU ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ ఎగ్జామ్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమించారు. అదేవిధంగా, జులై-1న తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కాలేజీ ప్రవేశాల కోసం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం ప్రకటించారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్ష (EAMCET) జులై 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే JNTU ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ ఎగ్జామ్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమించారు.
అదేవిధంగా, జులై-1న తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET), జూన్ 20వ తేదీ నుంచి (PG-ECET) ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇదిలాఉండగా,TS-ICET, TS EdCET, LAWCET, PECET వంటి కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీలను ఇంకా నిర్ణయించలేదని.. త్వరలోనే వీటికి పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.