సిమ్‌కార్డుతో పనిలేకుండా.. వోడాఫోన్ ఈ-సిమ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ దిగ్గజం ‘వోడాఫోన్ ఇండియా’ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదార్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అదే ఈ-సిమ్. ఇన్నిరోజులు సిమ్ కావాలంటే.. సదరు కంపెనీ ఔట్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే, రోజుకో కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్న ప్రస్తుతం తరుణంలోనూ.. సిమ్ కోసం ఔట్‌లెట్ వరకు వెళ్లాల్సి పనేంటని చాలా మందే అనుకుని ఉంటారు. వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఇక ఆ చింత అవసరం లేదు. ఈ-సిమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ దిగ్గజం ‘వోడాఫోన్ ఇండియా’ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదార్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అదే ఈ-సిమ్. ఇన్నిరోజులు సిమ్ కావాలంటే.. సదరు కంపెనీ ఔట్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే, రోజుకో కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్న ప్రస్తుతం తరుణంలోనూ.. సిమ్ కోసం ఔట్‌లెట్ వరకు వెళ్లాల్సి పనేంటని చాలా మందే అనుకుని ఉంటారు. వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఇక ఆ చింత అవసరం లేదు.
ఈ-సిమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్. యూజర్లు దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే.. ఇప్పటివరకు మనం వాడుతున్న ఫిజికల్ సిమ్‌కార్డు అవసరం ఉండదు. యూజర్లు సిమ్ కార్డు మార్చకుండానే కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్ కస్టమర్లకు ఈ అవకాశం అందుబాటులోకి రాగా.. రెండోదశలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్లకు ఈ-సిమ్ సౌకర్యం కలగజేయనుంది. ఐఫోన్ యూజర్లలోనూ.. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ వంటి యాపిల్ ఫోన్లను వాడుతున్న వినియోగదారులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని వోడాఫోన్ తెలిపింది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోని వోడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు ఈ-సిమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఇతర నగరాలకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి.