భారత చట్టాలను ఉల్లంఘించిన అమెజాన్‌!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చిక్కుల్లో పడింది. భారత చట్టాలను ఉల్లఘించిందనే ఆరోపణల కారణంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును ఎదుర్కోనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ రాయటర్స్ తాజాగా వెలువరించిన కథనంలో.. అమెజాన్ విక్రయిస్తున్న వస్తువుల విలువలో మూడింట ఒక వంతులో 33 మంది అమెజాన్ అమ్మకందారులే ఉన్నారు. అలాగే, అమెజాన్ సంస్థలో పరోక్షంగా పెట్టుబడులు ఉన్న మరో రెండు బడా కంపెనీలు 2019లో అమెజాన్‌లో చేసిన విక్రయాల్లో 33 శాతం వాటాను కలిగి […]

Update: 2021-02-18 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చిక్కుల్లో పడింది. భారత చట్టాలను ఉల్లఘించిందనే ఆరోపణల కారణంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును ఎదుర్కోనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ రాయటర్స్ తాజాగా వెలువరించిన కథనంలో.. అమెజాన్ విక్రయిస్తున్న వస్తువుల విలువలో మూడింట ఒక వంతులో 33 మంది అమెజాన్ అమ్మకందారులే ఉన్నారు. అలాగే, అమెజాన్ సంస్థలో పరోక్షంగా పెట్టుబడులు ఉన్న మరో రెండు బడా కంపెనీలు 2019లో అమెజాన్‌లో చేసిన విక్రయాల్లో 33 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంటే, మొదటి 33 మంది వాటా 33 శాతం కాగా, అమెజాన్ సంస్థలో పరోక్ష పెట్టుబడులున్న రెండు కంపెనీల వాటా 38 శాతం. దీనర్థం మొత్తం వాటాలో మూడింట రెండు వంతులు అమెజాన్ వాటాదారులే కలిగి ఉన్నారు. మొత్తం 4 లక్షల మంది వ్యాపారులు చేసే విక్రయాలు మూడింట ఒక వంతు అయితే, కేవలం ఈ 35 మంది చేస్తున్న విక్రయాలు మూడింట రెండు వంతులు. ఈ విషయాన్ని బహిరంగం చేయకుండా అమెజాన్ రహస్యంగా ఉంచింది. బయటకు మాత్రం మొత్తం 4 లక్షల మందికి వ్యాపార అవకాశాలను కల్పించినట్టు ప్రకటించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెనుతున్న మార్కెట్‌గా భారత్ ఉన్న నేపథ్యంలో అమెజాన్ సంస్థ ఈ మోసానికి ప్రయత్నించింది. ప్రచారంలో లక్షల మందికి వ్యాపారులకు అమెజాన్ ద్వారా అవకాశాలను ఇచ్చినట్టుగా చూపించి, వాస్తవంలో బడా కంపెనీలకే ఎక్కువ భాగం వ్యాపారాలను అప్పగించిందని కథనంలో పేర్కొన్నారు. అయితే, ఈ కథనంపై స్పందించిన అమెజాన్ ఆరోపణలను ఖండించింది. తాము భారతీయ చట్టాలను గౌరవిస్తామని వివరించింది.

అమెజాన్‌ను నిషేధించండి : సీఐఐటీ

అయితే, అమెజాన్ ఇండియాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ స్థానిక కార్యకలాపాలను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఐఐటీ) ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌లో 8 కోట్ల రిటైల్ దుకాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఐఐటీ తన ప్రకటనలో..అమెజాన్ చేసిన ఈ మోసంతో భారత్‌లో తన కార్యకలాపాలను నిషేధించేనుద్కు సరిపోతుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని సంస్థ కార్యకలాపాల నిషేధానికి ఆదేశాలివ్వాలని వాణిజ్య మంత్రి పీయుష్ గోయెల్‌ను కోరింది. కాగా, సీఐఐటీ ప్రకటనపై స్పందించని అమెజాన్, రాయటర్స్ కథనానికి రీట్వీట్ చేస్తూ..ఆధారాలు లేని, అసంపూర్ణ, అవాస్తవాలని విమర్శించింది. అమెజాన్ సంస్థ భారతీయ చట్టాలకు లోబడి ఉందని వెల్లడించింది.

Tags:    

Similar News