రూ.3.20 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

దిశ, కరీంనగర్:రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిరాటంకంగా సాగుతోంది. టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా ముప్పేట దాడులు చేస్తూ నకిలీ వ్యాపారస్తులను కటకటాలకు పంపిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.3.20 లక్షల విలువ చేసే 1.60 కింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ విద్యానగర్ కు చెందిన మడుపు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా రంగంపల్లికి చెందిన ఇందూరి లింగమూర్తి, కరీంనగర్ జిల్లా కందుగులకు […]

Update: 2020-06-20 08:17 GMT

దిశ, కరీంనగర్:రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిరాటంకంగా సాగుతోంది. టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా ముప్పేట దాడులు చేస్తూ నకిలీ వ్యాపారస్తులను కటకటాలకు పంపిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.3.20 లక్షల విలువ చేసే 1.60 కింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ విద్యానగర్ కు చెందిన మడుపు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా రంగంపల్లికి చెందిన ఇందూరి లింగమూర్తి, కరీంనగర్ జిల్లా కందుగులకు చెందిన పెద్దమళ్ల రాజు, రాణీపురంకు చెందిన తుమ్మ సురేష్ రెడ్డి , కొత్తపల్లికి చెందిన గట్టినేని రాజేశ్ , సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం శిల్లాపూర్ కు చెందిన బుర్ర సంతోష్ గౌడ్ లను అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై శనివారం విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, కరీంనగర్ టూటౌన్, చొప్పదండి స్టేషన్లకు చెందిన పోలీసు యంత్రాంగం ఏకకాలంలో దాడులు చేసింది. ఏపీ 15బిఎన్, 6543 వోక్స్ వ్యాగన్, హెచ్ఆర్ 26బిజడ్ 1678 స్విఫ్ట్ కార్లను, ప్రముఖ కంపెనీల పేరిట ముద్రించిన 2,200 కవర్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీలోని కర్నూలు, ప్రకాషం జిల్లాల నుంచి నకిలీ విత్తనాలను తెప్పించి జిల్లా రైతాంగానికి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Tags:    

Similar News