నకిలీ ఆర్మీ అధికారిపై పీడీ యాక్ట్..
దిశ, క్రైమ్ బ్యూరో : ఆర్మీ అధికారిగా చెలామణి అవుతున్న నాగరాజు కార్తీకేయ రఘువర్మపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రికల్ వర్క్, డ్రైవింగ్‌ను నేర్చుకున్నాడు. జీవనోపాధి కోసం పలువురి ఇళ్లల్లో కార్ డ్రైవర్‌గా చేరాడు. ఈ సందర్భంగా కార్ల దొంగతనం కేసులో పంజాగుట్ట, ఎస్సార్ నగర్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆర్మీ అధికారి ముసుగులో పశ్చిమగోదావరి జిల్లా, […]
దిశ, క్రైమ్ బ్యూరో : ఆర్మీ అధికారిగా చెలామణి అవుతున్న నాగరాజు కార్తీకేయ రఘువర్మపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రికల్ వర్క్, డ్రైవింగ్‌ను నేర్చుకున్నాడు. జీవనోపాధి కోసం పలువురి ఇళ్లల్లో కార్ డ్రైవర్‌గా చేరాడు. ఈ సందర్భంగా కార్ల దొంగతనం కేసులో పంజాగుట్ట, ఎస్సార్ నగర్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.
జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆర్మీ అధికారి ముసుగులో పశ్చిమగోదావరి జిల్లా, హైదరాబాద్ నగరంలో పలు చట్ట విరుద్దమైన కార్యకలపాలకు పాల్పడ్డాడు. మియాపూర్ పరిధిలో మెడికల్ షాపు యాజమాని నుంచి టాయ్ పిస్టల్‌తో బెదిరించి భారీగా డబ్బు వసూలు చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కార్తికేయ నేర చరిత్ర గమనించిన సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగించి మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలాఉండగా, పదే పదే నేరాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలపై కూడా సైబరాబాద్ పోలీసులు పీడీని ప్రయోగించారు.