నెట్టింట దుబ్బాక ఫలితాలు… గులాబీ వెనకంజపై ట్రోలింగ్స్
దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉప ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్‌డేట్ చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో దుబ్బాక అంశంపై ట్రోల్ అవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ వెనకంజపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే వారంతా దుబ్బాక ఫలితాలను రాష్ట్రంలోని ప్రతి అంశానికి ముడి పెడుతున్నారు. టీఆర్ఎస్ వెనకంజ అనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రతి పోస్టింగ్‌లోనూ కనిపిస్తోంది. ఉద్యోగాల కల్పన, […]
దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉప ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్‌డేట్ చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో దుబ్బాక అంశంపై ట్రోల్ అవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ వెనకంజపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే వారంతా దుబ్బాక ఫలితాలను రాష్ట్రంలోని ప్రతి అంశానికి ముడి పెడుతున్నారు.
టీఆర్ఎస్ వెనకంజ అనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రతి పోస్టింగ్‌లోనూ కనిపిస్తోంది. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాల వెనకంజ, కుటుంబ పాలనకు చరమగీతం అంటూ ఫలితాలపై విశ్లేసిస్తున్నారు. అంతేకాకుండా గులాబీకి అండగా ఉండే మీడియాను కూడా ఆడుకుంటున్నారు. పింక్ మీడియా ముఖం చాటేస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దుబ్బాకలో గెలుపోటములను పక్కన పెడితే బీజేపీ బలం పుంజుకుందని, వచ్చే గ్రేటర్‌లో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ప్రతి నిమిషానికి అప్‌డేట్ చేస్తున్నారు. గతంలోని లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. దుబ్బాక ఫలితాలను వాట్సాప్ స్టేటస్‌లను వేలాది మంది పోస్టు చేసుకుంటున్నారు. గ్రూపు ఏదైనా, ఫేస్‌బుక్ తెరిచినా దుబ్బాక చర్చే సాగుతోంది.
అక్కడ ట్రంప్… ఇక్కడ కేసీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను అగ్రరాజ్యం ఎన్నికలతో ముడి పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింటా హల్‌చల్ చేస్తున్నాయి. వైట్‌హౌస్ నుంచి ట్రంప్‌ను ఈడ్చి వేసే వీడియోలను ఇప్పుడు రాష్ట్రానికి క్రియేట్ చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అధికారంపై విర్రవీగిన ట్రంప్ ఎలాగైతే బోల్తా పడ్డారో… రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందంటూ జోస్యం చెప్పుతూ వీడియోలను పెడుతున్నారు.
ఇంత ఆగ్రహమా…?
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పెడుతున్న పోస్టులు అధికార పార్టీపై ఉన్న అక్కసును బహిరంగం చేసుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో సంక్షేభం, పథకాల అమలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు, నూతన సచివాలయ నిర్మాణం, పేదల పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగం, పదవీ విరమణ పొందిన వారికి మళ్లీ పదవులు, రాజకీయ నేతల అవినీతి, వరద సాయం అక్రమాలు, రైతుల సమస్యలు, సన్న వడ్ల కొనుగోళ్లు వంటి అంశాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ప్రతి అంశంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం కుటుంబంలో రాజకీయ పదవులకు మాత్రమే రాష్ట్రాన్ని వాడుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధికార పార్టీపై ఇంత స్థాయిలో మండిపడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.