మీకు ఆ అధికారం లేదు.. అరెస్ట్ చేస్తామంటూ వీడీసీలకు DSP వార్నింగ్

దిశ, నిర్మల్ రూరల్ : స‌మాంత‌ర స‌ర్కారుగా మారుతూ గ్రామాభివృద్ధి క‌మిటీలు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. సోన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మండలంలోని కడ్తాల్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం వీడీసీ సభ్యులు ఇచ్చిన తీర్పుతో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన 15 మంది వీడీసీ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వీడీసీ […]

Update: 2021-09-01 06:30 GMT

దిశ, నిర్మల్ రూరల్ : స‌మాంత‌ర స‌ర్కారుగా మారుతూ గ్రామాభివృద్ధి క‌మిటీలు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. సోన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.

మండలంలోని కడ్తాల్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం వీడీసీ సభ్యులు ఇచ్చిన తీర్పుతో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన 15 మంది వీడీసీ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వీడీసీ సభ్యులు కేవలం గ్రామాభివృద్ధికి పాటుపడాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని తెలిపారు.

గ్రామాల్లో వీడీసీ సభ్యులు పెత్తనం చెలాయిస్తే.. తమ దృష్టికి తీసుకురావాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి పేరిట దాడులకు పాల్పడటం, సామాజిక బహిష్కరణ లాంటివి చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వీడీసీ సభ్యులపై రౌడీ షీట్ కేసు నమోదు చేయడానికి వెనుకాడబోమని అన్నారు. ఈ సమావేశంలో సీఐ జీవన్ రెడ్డి, ఎస్‌ఐ ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News