రిస్క్ చేసిన తహసీల్దార్.. థ్యాంక్స్ చెప్పిన రైతులు
దిశ, మానకొండూరు : ప్రమాదవశాత్తు పశుగ్రాసానికి మంటలు అంటుకోవడంతో స్థానిక రెవెన్యూ అధికారి తన వంతుగా ధైర్యం చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఈ ఘటన శంకరపట్నం మండలంలోని శంకరపట్నం గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న రెవెన్యూ కార్యాలయం సమీపంలోని పశుగ్రాసం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. అది గ్రహించిన శంకరపట్నం తహసీల్దార్ గూడూరు శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని తన వంతు సాయంగా సిబ్బందితో నీళ్లను తెప్పించి.. కర్రలు, […]
దిశ, మానకొండూరు : ప్రమాదవశాత్తు పశుగ్రాసానికి మంటలు అంటుకోవడంతో స్థానిక రెవెన్యూ అధికారి తన వంతుగా ధైర్యం చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఈ ఘటన శంకరపట్నం మండలంలోని శంకరపట్నం గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న రెవెన్యూ కార్యాలయం సమీపంలోని పశుగ్రాసం ప్రమాదవశాత్తు దగ్ధమైంది.
అది గ్రహించిన శంకరపట్నం తహసీల్దార్ గూడూరు శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని తన వంతు సాయంగా సిబ్బందితో నీళ్లను తెప్పించి.. కర్రలు, నీటితో మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న కేశవపట్నం ఎస్‌ఐ తోట తిరుపతి ఘటనా స్థలికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. ఎమ్మోర్వో శ్రీనివాస రావు శ్రమను చూసిన ప్రతి ఒక్కరూ, బాధిత రైతులు ధన్యవాదాలు తెలిపారు.