తాగిండు..బస్సు ఎత్తుకెళ్లిండు
మద్యం మత్తులో ఓ ప్రబుద్ధుడు ప్రయాణికులతో ఉన్నఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..మధ్నాహం సమయంలో భోజనం చేద్దామని ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ ప్రయాణికులతో ఉన్నబస్సును తాండూర్ డిపోలో నిలిపి వెళ్లారు. అయితే తాగిన మైకంలో ఓ వ్యక్తి డిపోలో నిలిపి ఉన్నబస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. బస్సును అడ్డదిడ్డంగా నడుపుతుండటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆవ్యక్తిని ప్రశ్నించారు. స్పందించిన ఆయన ఈ బస్సుకు డ్రైవర్,కండక్టర్ నేనే అంటూ సమాధానం […]
మద్యం మత్తులో ఓ ప్రబుద్ధుడు ప్రయాణికులతో ఉన్నఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..మధ్నాహం సమయంలో భోజనం చేద్దామని ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ ప్రయాణికులతో ఉన్నబస్సును తాండూర్ డిపోలో నిలిపి వెళ్లారు. అయితే తాగిన మైకంలో ఓ వ్యక్తి డిపోలో నిలిపి ఉన్నబస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. బస్సును అడ్డదిడ్డంగా నడుపుతుండటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆవ్యక్తిని ప్రశ్నించారు. స్పందించిన ఆయన ఈ బస్సుకు డ్రైవర్,కండక్టర్ నేనే అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందని భావించిన ప్రయాణికులు బస్సు నడుపుతున్న వ్యక్తిని గట్టిగా నిలదీశారు.అదే సమయంలో వికారాబాద్ రానే వచ్చింది. ప్రయాణికులు ఎక్కడ దాడి చేస్తారోనని భావించిన ఆ వ్యక్తి బస్సును వికారాబాద్ సిటీ శివారులోనే నిలిపివేసి పరారయ్యాడు. ప్రయాణికుల ఫిర్యాదుతో వికారాబాద్‌కు చేరుకున్నపోలీసులు బస్సులోని వారిని ప్రశ్నించారు. అనంతరం వికారాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్‌కు పోలీసులు సమాచారమివ్వడంతో ఆయన తాండూరు డిపో మేనేజర్‌కు సమస్యను తెలియపరిచారు. ఆ వెంటనే డ్రైవర్,కండక్టర్ బస్సు వదిలి వెళ్లిన ప్రాంతానికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బస్సును ఎవరు ఎత్తుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.