ఈ నెలలోనే డ్రోన్ డెలివరీ

దిశ, వెబ్‌డెస్క్: డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని, వస్తువులను డెలివరీ చేయడానికి జొమాటో, డుంజోలు రంగం సిద్ధం చేశాయి. ఈ నెలలోనే ట్రయల్స్ చేసేసి, నెలాఖరులోగా డెలివరీలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ట్రయల్స్ చేయడానికి జొమాటో సంస్థకు రాజస్థాన్‌లో అల్వార్ ప్రాంతాన్ని కేటాయించగా, డుంజో సంస్థకు బెంగళూరును కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ట్రయల్స్ నిర్వహించడానికి ఆల్టర్‌నేటివ్ గ్లోబల్ ఇండియా అనే కన్సల్టింగ్ కంపెనీని ఈ రెండు సంస్థలు ఆశ్రయించాయి. ఇప్పటికే ఈ కన్సల్టింగ్ సంస్థ.. అమెరికా, లండన్‌లలో […]

Update: 2020-09-10 03:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని, వస్తువులను డెలివరీ చేయడానికి జొమాటో, డుంజోలు రంగం సిద్ధం చేశాయి. ఈ నెలలోనే ట్రయల్స్ చేసేసి, నెలాఖరులోగా డెలివరీలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ట్రయల్స్ చేయడానికి జొమాటో సంస్థకు రాజస్థాన్‌లో అల్వార్ ప్రాంతాన్ని కేటాయించగా, డుంజో సంస్థకు బెంగళూరును కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ట్రయల్స్ నిర్వహించడానికి ఆల్టర్‌నేటివ్ గ్లోబల్ ఇండియా అనే కన్సల్టింగ్ కంపెనీని ఈ రెండు సంస్థలు ఆశ్రయించాయి. ఇప్పటికే ఈ కన్సల్టింగ్ సంస్థ.. అమెరికా, లండన్‌లలో ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్‌ల ద్వారా డెలివరీని పర్యవేక్షిస్తోంది.

రెండు కంపెనీలకు కలిపి 100 గంటల పాటు ట్రయల్స్ చేయాలని ఈ కన్సల్టింగ్ కంపెనీ నిర్ణయించింది. అయితే జొమాటోకు ఒక రకంగా, డుంజోకు మరో రకంగా ట్రయల్స్ చేయబోతున్నారు. జొమాటో డెలివరీకి ఫుడ్, మెడిసిన్ డెలివరీ టెక్నిక్‌ను ఉపయోగిస్తే, డుంజో కోసం ప్యాకేజీ డెలివరీని ఫోకస్ చేయనున్నారు. వీటి ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత స్విగ్గీ కూడా డ్రోన్ డెలివరీని ప్రయత్నించనున్నట్లు సమాచారం.

Read Also…

మహిళల ఉపాధి కోసం SHG స్టోర్స్..

Full View

Tags:    

Similar News