వరంగల్ వాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‎లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే, రూ. వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. వరంగల్‌లో చేపట్టే అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేటీఆర్.. ప్రతీ ఏటా రూ. 300 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్ర‌జోప‌యోగ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తామన్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత రోడ్లు, డ్రైనేజీల‌కు స‌త్వ‌ర‌మే మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలని సంబంధిత […]

Update: 2020-12-21 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‎లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే, రూ. వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. వరంగల్‌లో చేపట్టే అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేటీఆర్.. ప్రతీ ఏటా రూ. 300 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్ర‌జోప‌యోగ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తామన్నారు.

వ‌ర‌ద ప్ర‌భావిత రోడ్లు, డ్రైనేజీల‌కు స‌త్వ‌ర‌మే మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు అవ‌స‌ర‌మైన సిబ్బంది నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చారు. ఇక గ‌డిచిన 10 ఏళ్ళ‌కంటే.. గ‌త ఆరేండ్ల‌లో చేసిన ప్రగతి సాధించామన్న కేటీఆర్.. కేంద్రం ఇచ్చిన దానికంటే.. మ‌న‌మే ఐదున్న‌ర రెట్లు ఎక్కువ ఇచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నగర కార్పొరేషన్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ‌ర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News