ఇండియన్ సెల్ బయాలజిస్ట్ రణదివేకు గూగుల్ నివాళి

దిశ, ఫీచర్స్: భారతీయ కణ జీవశాస్త్రవేత్త డాక్టర్ కమల్ రణదివే 104వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆమెకు డూడుల్‌ను అంకితం చేసింది గూగుల్. భారతదేశానికి చెందిన కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించిన గూగుల్ డూడుల్.. డాక్టర్ రణదివే మైక్రోస్కోప్‌‌లో కణాలను పరిశీలిస్తున్నట్లు చూపుతోంది. క్యాన్సర్‌, వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాలను మొట్టమొదట గుర్తించిన బయో మెడికల్‌ రీసెర్చర్‌ ఆమెనే కాగా.. ఇండియన్‌ ఉమెన్‌ సైంటిస్ట్‌ అసోసియేషన్‌‌ను ప్రారంభించి విశేష కృషి చేసింది. విజ్ఞాన శాస్త్రం, విద్య […]

Update: 2021-11-08 03:58 GMT

దిశ, ఫీచర్స్: భారతీయ కణ జీవశాస్త్రవేత్త డాక్టర్ కమల్ రణదివే 104వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆమెకు డూడుల్‌ను అంకితం చేసింది గూగుల్. భారతదేశానికి చెందిన కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించిన గూగుల్ డూడుల్.. డాక్టర్ రణదివే మైక్రోస్కోప్‌‌లో కణాలను పరిశీలిస్తున్నట్లు చూపుతోంది. క్యాన్సర్‌, వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాలను మొట్టమొదట గుర్తించిన బయో మెడికల్‌ రీసెర్చర్‌ ఆమెనే కాగా.. ఇండియన్‌ ఉమెన్‌ సైంటిస్ట్‌ అసోసియేషన్‌‌ను ప్రారంభించి విశేష కృషి చేసింది. విజ్ఞాన శాస్త్రం, విద్య ద్వారా సమసమాజాన్ని సృష్టించాలనే లక్ష్యంతో రణదివే పనిచేసింది.

కమల్ రణదివేగా ప్రసిద్ధి చెందిన కమల్ సమరత్ 1917లో ఇండియాలోని పూణే‌లో జన్మించారు. తండ్రి ఆమెను వైద్య విద్య అభ్యసించమని ప్రోత్సహించినప్పటికీ తను మాత్రం జీవశాస్త్రాన్ని చదివింది. బీఎస్సీ తర్వాత పూణే‌లోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి 1934లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 1943లో సైటోజెనిటిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించిన కమల్‌.. జేటీ రణదివేను పెళ్లి చేసుకున్నాక ముంబై వెళ్లిపోయి అక్కడే ‘టాటా మెమోరియల్‌ ఆస్పత్రి’లో పని చేయడం మొదలుపెట్టింది. 1949లో ‘ఇండియన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ (ICRC)’లో పరిశోధకురాలిగా పనిచేస్తున్నప్పుడు, కణాల అధ్యయనానికి సంబంధించిన సైటోలజీలో డాక్టరేట్ పొందింది. USA మేరీల్యాండ్‌, బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో ఫెలోషిప్ తర్వాత ఆమె ముంబై (అప్పటి బొంబాయి), ICRCకి తిరిగి వచ్చింది. అక్కడ దేశంలోనే మొట్టమొదటి కణజాల సంస్కృతి ప్రయోగశాలను స్థాపించింది. ఈ క్రమంలోనే లుకేమియా, రొమ్ము, గొంతు కేన్సర్లకు కారణాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది. కేన్సర్‌ కణితులకు, వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు. బ్యాక్టీరియాపై కమల్‌ చేసిన పరిశోధనల ఆధారంగా కుష్టు వ్యాధికి కారణమయ్యే మైకోబాక్టీరియం లెప్రేకు చెక్ పెట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలోనూ సహాయం చేసింది.

11 మంది సహచరులతో కలిసి డాక్టర్ రణదివే శాస్త్రీయ రంగాల్లో మహిళలకు మద్దతుగా భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం(IWSA)ను 1973లో స్థాపించింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు, మేధావులను స్వదేశానికి తిరిగి రావాలని, వారి జ్ఞానాన్ని తోటి భారతీయుల కోసం ఉపయోగించాలని కోరింది. 1989లో పదవీ విరమణ తర్వాత రణదివే మహారాష్ట్రలోని గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం పనిచేసింది. వారికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలుగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆరోగ్య, పోషకాహార విద్యను అందించింది. IWSA ఇప్పుడు భారతదేశంలో 11 సెంటర్స్ కలిగి ఉండగా.. సైన్స్‌లో మహిళలకు స్కాలర్‌షిప్స్, పిల్లల సంరక్షణ ఎంపికలను అందిస్తోంది.

డేరింగ్ లేడీ.. కశ్మీర్‌లో 50 ఎత్తయిన సరస్సుల ట్రెక్కింగ్‌తో రికార్డ్

Tags:    

Similar News