manchu vishnu: ‘కన్నప్ప’ సినిమాపై ట్రోలింగ్‌.. మంచు విష్ణు రియాక్షన్ ఇదే.. (వీడియో)

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’(Kannappa).

Update: 2025-03-24 03:26 GMT
manchu vishnu: ‘కన్నప్ప’ సినిమాపై ట్రోలింగ్‌.. మంచు విష్ణు రియాక్షన్ ఇదే.. (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’(Kannappa).ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో రాబోతున్న ‘కన్నప్ప’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రభాస్(Prabhas),అవ్రామ్, మంచు విష్ణు, మోహన్ లాల్(Mohanlal), శరత్ కుమార్(Sharath Kumar), బ్రహ్మానందం(Brahmanandam), బ్రహ్మాజి, మధుబాల వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ‘కన్నప్ప’ నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ పలు అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పలువురు నెటిజన్లు ‘కన్నప్ప’ చిత్రంపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై మంచు విష్ణు స్పందించారు. ‘‘కొంతమంది ఏదైనా క్లిప్‌ను కట్ చేసి దాన్ని వైరల్ చేసి ట్రోల్స్, కాంట్రవర్సీ చేయడం వంటివి చేస్తున్నారు.

కాబట్టి అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ మధ్య చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. ఏదైనా కాంట్రవర్సీ అయితే పూర్తి వీడియోను సెర్చ్ చేసి చూస్తున్నారు. మరికొందరు మాత్రం పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. అయినా అలాంటివి నేను పట్టించుకోను’’ అని అన్నారు. ఆ తర్వాత రఘుబాబు మాట్లాడుతూ.. కన్నప్పను ట్రోల్ చేయడం దారుణం. అలా చేసిన వారిని శివుడు కచ్చితంగా శిక్షిస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News