Anil Ravipudi and Chiranjeevi: ‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం.. మెగా ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలో ‘విశ్వంభర’ (Vishvambhara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Update: 2025-03-26 11:12 GMT
Anil Ravipudi and Chiranjeevi: ‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం.. మెగా ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలో ‘విశ్వంభర’ (Vishvambhara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ అనంతరం చిరంజీవి మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టారు. వాటిలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) మూవీ ఒకటి.

ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అందుకుని.. ప్రజెంట్ టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ (Successful) డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా ఉండనుందని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడ్ మెగాస్టార్ చిరంజీవి మూవీపై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో X వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయింది & లాక్ చేయబడింది. చిరంజీవికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను.. ఆయన దానిని ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అంటూ పెట్టిన పోస్ట్ ప్రజెంట్ నెట్టింట్ వైరల్‌గా మారడంతో... మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News