జీడబ్ల్యూఎంసీలో అధికారుల జీ హుజూర్…!
దిశ ప్రతినిధి, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ డివిజన్ల పునర్విభజన ముసాయిదాను పరిశీలిస్తే.. వండిచేవాడు మనోడు అయితే మనకు పడాల్సిన ముక్కలు ఎక్కడికిపోవు అన్న సామెత గుర్తుకు వస్తోంది. రాజకీయ బలం ముందు జీడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు జీహుజూర్ అన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కమిషనర్ పమేలా సత్పతి ముసాయిదా జాబితా నివేదికపై సంతకం చేయడం గమనార్హం. అధికారులు విడుదల చేసిన ముసాయిదాలో డివిజన్ల పునర్విభజనకు మార్గదర్శకాలు అనుసరించలేదని స్పష్టమవుతోంది. […]
దిశ ప్రతినిధి, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ డివిజన్ల పునర్విభజన ముసాయిదాను పరిశీలిస్తే.. వండిచేవాడు మనోడు అయితే మనకు పడాల్సిన ముక్కలు ఎక్కడికిపోవు అన్న సామెత గుర్తుకు వస్తోంది. రాజకీయ బలం ముందు జీడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు జీహుజూర్ అన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కమిషనర్ పమేలా సత్పతి ముసాయిదా జాబితా నివేదికపై సంతకం చేయడం గమనార్హం. అధికారులు విడుదల చేసిన ముసాయిదాలో డివిజన్ల పునర్విభజనకు మార్గదర్శకాలు అనుసరించలేదని స్పష్టమవుతోంది. సమగ్రమైన వివరాలను కూడా పొందుపర్చలేదు.
డివిజన్ల పునర్విభజనలో కీలక అంశాలైన జనాభా, ఓటర్ల సంఖ్య, భౌగోళిక అంశాలతో సంబంధం లేకుండానే ప్రక్రియను పూర్తి చేసినట్లుగా అర్థమవుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో వచ్చే డివిజన్ల రెవెన్యూ బ్లాకులు, ఇంటినంబర్లు లేకుండానే ఇచ్చేశారు. కాలనీ పేర్లతో సరిపెట్టారు. భౌగోళిక అంశాలు పరిగణనలోకి తీసుకోలేదు. రాజకీయ కారణాలతో కొన్ని డివిజన్లు విచ్చిన్నం చేసినట్లుగా కనిపిస్తుంది. 66 డివిజన్ల వారీగా జనాభా, మొత్తం ఓటర్ల వివరాలు తెలుపలేదు.
2016లో ఖరారైన 58 డివిజన్లకు మరో 8 డివిజన్లు జత కావడంతో 66 డివిజన్లకు చేరుకుంది. 66 కొత్త డివిజన్ల ఏర్పాటుతో జీడబ్ల్యూఎంసీ భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. పునర్విభజనంతో దాదాపుగా అన్ని డివిజన్ల సరిహద్దులు, డివిజన్ల నెంబర్ మారిపోయింది. ముచ్చర్ల నుంచి 1వ డివిజన్ మొదలై, ఈస్ట్ వైపు హసన్‌పర్తి 66 డివిజన్‌తో ముగిసింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ విలీన గ్రామాల్లో డివిజన్ల నంబర్లు, సరిహద్దులు 60-70 శాతం వరకు మారిపోయాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2021 జనవరిలోని ఓటర్ల తుది జాబితా ఆధారంగా పునర్విభజన ప్రక్రియను చేపట్టారు. ఈ లెక్కన మొత్తం జనాభా 6.53 లక్షలను 66 డివిజన్లలో విభజించారు. ఒక్కో డివిజన్‌లో 9,300 నుంచి 9,800 వరకు జనాభా ఉంది. అయితే వ్యత్యాసం 10శాతానికి అటు ఇటుగా మించకూడదని నిబంధనలున్నా.. కొన్ని డివిజన్లలో పట్టించుకోకపోవడం గమనార్హం.