కేటీఆర్ ఇలాఖాలో డబుల్ ఇళ్ల దందా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోందని, ఇళ్లు కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనని విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ డబుల్ ఇళ్ల మంజూరీ విషయంలో అవినీతికి దర్పణంగా నిలుస్తోంది. పారదర్శక పాలన అందిస్తామని పదే పదే చెప్తున్న మంత్రి కేటీఆర్ ఇలాఖలోనే వసూళ్ల పర్వం ఇలా సాగితే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోందని, ఇళ్లు కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనని విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ డబుల్ ఇళ్ల మంజూరీ విషయంలో అవినీతికి దర్పణంగా నిలుస్తోంది. పారదర్శక పాలన అందిస్తామని పదే పదే చెప్తున్న మంత్రి కేటీఆర్ ఇలాఖలోనే వసూళ్ల పర్వం ఇలా సాగితే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో డబ్బుల లావాదేవీల తంతు సాగినట్టు స్పష్టం అవుతోంది. మొదటి జాబితాలో పేర్లు ఉండగా తుది జాబితా వచ్చే సరికి మాయం కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో కూడా లబ్దిదారులు తమకు అన్యాయం జరిగిందంటూ నెత్తినోరు బాదుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక విషయంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.