త్వరలోనే పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ రైల్

దిశ, వెబ్‌డెస్క్: ఈ తరానికి డబుల్ డెక్కర్ బస్సులు తెలియకపోవచ్చు కానీ, 90వ దశకంలో మాత్రం ఈ బస్సుల్లో హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కాగా హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పుతామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డబుల్ డెక్కర్ బస్సులే కాదు, ఇకపై డబుల్ డెక్కర్ రైళ్లలోనూ తిరిగే చాన్స్ రాబోతుంది. సెమీ హై స్పీడ్‌తో నడిచే డబుల్ డెక్కర్ ట్రైన్స్‌ను ఇండియన్ రైల్వేస్.. కపూర్తలలోని రైల్ కోచ్ […]

Update: 2020-11-22 01:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ తరానికి డబుల్ డెక్కర్ బస్సులు తెలియకపోవచ్చు కానీ, 90వ దశకంలో మాత్రం ఈ బస్సుల్లో హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కాగా హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పుతామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డబుల్ డెక్కర్ బస్సులే కాదు, ఇకపై డబుల్ డెక్కర్ రైళ్లలోనూ తిరిగే చాన్స్ రాబోతుంది.

సెమీ హై స్పీడ్‌తో నడిచే డబుల్ డెక్కర్ ట్రైన్స్‌ను ఇండియన్ రైల్వేస్.. కపూర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోలిస్తే ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ట్రైన్ కోచ్‌ల్లో.. రిఫ్రెష్‌మెంట్ రూమ్స్, చార్జింగ్ సాకెట్స్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎల్‌ఈడీ డెస్డినేషన్ బోర్డ్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు వీటిలో స్మోక్ డిటెక్టర్స్‌తో పాటు సీసీ టీవీ కెమెరాలు కూడా ఉండటం విశేషం. కాగా డబుల్ డెక్కర్ రైల్ ఫొటోలను ఇటీవలే తన ట్విట్టర్ ద్వారా పంచుకున్న రైల్వే మంత్రి పీయుష్ గోయల్.. ‘కపూర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ.. దేశీయ అభివృద్ధి, నూతన ఆవిష్కరణల్లో మొదటి నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తోంది. న్యూ జనరేషన్ డబుల్ డెక్కర్ ఏసీ చెయిర్ కార్ కోచ్‌ను చూడండి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News