కట్టినవి పంచరు.. కొత్తగ కట్టరు
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇరుకు గదులు, కిరాయి కొంపల్లో బీదలు పడే బాధలు అనుభవించేవారికంటే అద్భుతంగా వర్ణించారు సీఎం కేసీఆర్. అసొంటి గరీబులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఫ్రీగా కట్టిస్తానని తొలినాళ్లలోని ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. తన ఎన్నికల ప్రణాళికకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ స్థాయి పవిత్రతనూ ఆపాదించారు. ఆ ఒక్క హామీనే హైదరాబాద్ బస్తీ జనాలను విపరీతంగా ఆకట్టుకొన్నది. సీఎం అండ్ టీఆర్ఎస్‌కు గుండెల్లో ‘గూడు’ కట్టుకున్నారు. తమకు గూడు ఇస్తారన్నది లక్షలాది పేదల ఆశ. […]
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇరుకు గదులు, కిరాయి కొంపల్లో బీదలు పడే బాధలు అనుభవించేవారికంటే అద్భుతంగా వర్ణించారు సీఎం కేసీఆర్. అసొంటి గరీబులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఫ్రీగా కట్టిస్తానని తొలినాళ్లలోని ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. తన ఎన్నికల ప్రణాళికకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ స్థాయి పవిత్రతనూ ఆపాదించారు. ఆ ఒక్క హామీనే హైదరాబాద్ బస్తీ జనాలను విపరీతంగా ఆకట్టుకొన్నది. సీఎం అండ్ టీఆర్ఎస్‌కు గుండెల్లో ‘గూడు’ కట్టుకున్నారు. తమకు గూడు ఇస్తారన్నది లక్షలాది పేదల ఆశ. ఆ ఆశ వయసు ఆరేండ్ల పైమాటే. నేటికీ సిటీలో ఏ మురికి వాడ బీదను కదిపినా, అదే అంతరంగం ధ్వనిస్తోంది. తమ జీవిత కల కండ్ల జూస్తామనే ఎదురుచూపుల రోజులు టీవీ సీరియళ్ల సాగతీతనూ డామినేట్ చేస్తున్నాయి.
గొప్ప పథకం.. గొప్పలకే పరిమితం
వాస్తవంగానే ఇది గొప్ప పథకం. కానీ, చూడబోతే గొప్పలకే పరిమితమైంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఇండ్ల నిర్మాణానికి మల్కాజిగిరి సెగ్మెంట్ అల్వాల్ సర్కిల్-16 ఎస్సీ బస్తీలో 2015 అక్టోబరు 28న మినిస్టర్లు, లీడర్లు, ఆఫీసర్లు భూమిపూజ చేశారు. నేటికీ ఒక్క ఇల్లయినా కట్టలేదు. పోనీ, కట్టించిన చోట్లయినా లబ్ధిదారులకు పంపిణీ చేశారా? అంటే అదీ లేదు! లక్షిత గణాంకాలూ ఘనమే. కానీ, కార్యాచరణే గగనం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఉనికి సమాహారమే భాగ్యనగరం. ఈ ‘గ్రేటర్’ను స్లమ్ ఫ్రీ సిటీ చేయాలని పాలకులు నాడే సంకల్పించారు. ఇందుకు తగినవిగా 117 ప్లేసులను ఐడెంటిఫై చేశారు. మొదటి విడతలో 2019 మార్చి నాటికి 2.72 లక్షల హౌసెస్ కట్టాలని డిసైడయ్యారు. అందుకు రూ.22 వేల కోట్లు ఖర్చుకు లెక్కలేశారు. అంతేనా! 2024కల్లా మరో త్రీ ల్యాక్స్ హౌసెస్ నిర్మించాలని అపుడే తలపోశారు. తీరా భౌతికంగా చూస్తే, కేవలం లక్ష ఇండ్ల పనులు మొదలుపెట్టారు. 3 నుంచి 9 ఫ్లోర్లతో ప్లానేశారు. 2019 ముగిసేనాటికి 11 వేల ఇండ్లు నిర్మించారు. నిజానికి వాటిని లాభితులకు గత జనవరిలోనే పంచుతామని ఊరించారు. మళ్లీ పెండింగే.
టార్గెట్ కుదిస్తూ.. కాలయాపన చేస్తూ..
మోయలేని భారమనో, మనసు రాకనో ప్రభుత్వం ఏం ఫీలవుతుందో? కానీ కాలయాపనే ఎంచుకున్నట్టుంది! మరో ఫోర్ ఇయర్సులోగా టోటల్‌గా 5.72 లక్షల ఇండ్లు కట్టాల్సి వుంది. ఇప్పటికైతే ఫుల్ షేప్‌లో కంప్లీట్ అయినవి జెస్ట్ 11 వేలే. టార్గెట్, ఖర్చులు కొండంత ఉన్నాయని జడుసుకున్నారు కాబోలు, ఆ లక్ష్యాన్ని కుదిస్తున్నారు. తొలి ఫేజులో తొలి కుదింపుగా 18 ప్రాంతాల్లో 5,050 ఇండ్లను కట్టాలని డిసైడయ్యారు. 13 చోట్ల 9 అంతస్తులు, తక్కిన కాడ మూడంతస్తులవి. దీనికి రూ. 428 కోట్లు వ్యయం. 353 కోట్లు సర్కార్ సబ్సిడీ. జీహెచ్ఎంసీ వాటా రూ.37.47 కోట్లు. ఒక్కో యూనిట్‌కు రూ.7.50 లక్షలు. ఇతర సౌకర్యాలకు రూ.1.50 లక్షలు. యూనిట్ టోటల్ కాస్ట్ రూ.9 లక్షలు. ఇదీ లెక్కాపత్రాల సంగతి. ఆ అంకెలు, రికార్డుల మాటెలా ఉన్నా బీదోళ్లు వేచి చూస్తున్నది కేసీఆర్ ప్రవచిత ‘ఆత్మగౌరవ గృహం’ కోసం. పాలకులు ఎలాగూ ‘పట్టణ ప్రగతి’కొస్తున్నారు. రాబోయేది గ్రేటర్ సమరం. పడకేసిన ఇండ్ల పథకం పరంగా రాజకీయంగానూ సంకటమే. ఇకనైనా అవరోధాలపై నజర్ పెట్టాలి. సిటీ పేదల సొంతింటి కల నెరవేర్చాలి.