ఐసీసీపై అరుణ్ ధుమాల్ ఫైర్

దిశ, స్పోర్ట్స్: టీ-20 వరల్డ్ కప్ నిర్వహణ నిర్ణయంపై జాప్యం చేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఎందుకు జాప్యం చేస్తోందో తెలియడం లేదన్నారు. ఒకవైపు ప్రపంచ కప్ నిర్వహించలేమని ఆతిథ్య జట్టు చెబుతున్నా ఐసీసీ మాత్రం ఎందుకు ఎదురు చూస్తోందని మండిపడ్డారు. బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ధుమాల్.. ఐసీసీ ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ప్రపంచ క్రికెట్‌కు అంత […]

Update: 2020-06-17 09:10 GMT

దిశ, స్పోర్ట్స్: టీ-20 వరల్డ్ కప్ నిర్వహణ నిర్ణయంపై జాప్యం చేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఎందుకు జాప్యం చేస్తోందో తెలియడం లేదన్నారు. ఒకవైపు ప్రపంచ కప్ నిర్వహించలేమని ఆతిథ్య జట్టు చెబుతున్నా ఐసీసీ మాత్రం ఎందుకు ఎదురు చూస్తోందని మండిపడ్డారు. బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ధుమాల్.. ఐసీసీ ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ప్రపంచ క్రికెట్‌కు అంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్తంభించిన క్రికెట్‌ను ఎంత త్వరగా ప్రారంభిస్తే ఆటకు అంత మేలు చేసిన వాళ్లమవుతామని ధుమాల్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News

Aishwarya Lekshmi