సంక్రాంతి పండక్కి సొంతూళ్ల బాటపట్టిన HYD వాసులు
సంక్రాంతి పండగ(Sankranti Festival) వస్తే చాలు హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండగ(Sankranti Festival) వస్తే చాలు హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతుంటాయి. నగరవాసులంతా సొంతూళ్లకు వెళ్తుండటంతో ప్రయాణ ప్రాంగణాలన్నీ రద్దీగా మారుతుంటాయి. తాజాగా.. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగర ప్రజలంతా సొంతూళ్ల బాటపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో అంతా గ్రామాలకు బయలుదేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లలో ఇసకేస్తే రాలనంత జనంతో హడావిడి నెలకొంది. ముఖ్యంగా ప్రయాణికులతో ఎల్బీనగర్ కూడలి రద్దీగా మారింది. శుక్రవారం సాయంత్రం ఎల్బీనగర్ నుంచి పనామా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.