పీఎం సహాయ నిధికి డికె. అరుణ విరాళం
దిశ,మహబూబ్‌నగర్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ తమవంతు చేయూత అందించాలని మాజీ మంత్రి డికె. అరుణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3లక్షలను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతిఒక్కరూ కూడా తమ బాధ్యత గా రూ.100 తగకుండా విరాళాలను అందచేయలని కోరారు. అలాగే ప్రజలు అందరు కూడా వచ్చే 15వ తేదీ వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను […]
దిశ,మహబూబ్‌నగర్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ తమవంతు చేయూత అందించాలని మాజీ మంత్రి డికె. అరుణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3లక్షలను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతిఒక్కరూ కూడా తమ బాధ్యత గా రూ.100 తగకుండా విరాళాలను అందచేయలని కోరారు. అలాగే ప్రజలు అందరు కూడా వచ్చే 15వ తేదీ వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు. అదేవిధంగా 5వ తేదీన ప్రధాని పిలుపు మేరకు అందరూ రాత్రి 9గంటల 9 నిమిషాలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులను వెలిగించి ఇంటి ముందు నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
Tags : donation, Prime Minister, Aid Fund, dk aruna, mahaboobnagar