'మిత్రులు..శ్రేయోభిలాషులకు.. నేను మీ డొక్కా మాణిక్య వరప్రసాద్'

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తెలుగుదేశం పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. రాయపాటి సాంబశివరావు అనుచరుడిగా పేర్కొనే డొక్కా ఆయనతో పాటు తొలుత కాంగ్రెస్ పార్టీలో తరువాత ఆయనతో పాటు టీడీపీలోకి మారారు. వైఎస్సార్సీపీలో ప్రవేశించనున్నారన్న నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆ పార్టీ నుంచి తీవ్ర […]

Update: 2020-03-09 01:15 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తెలుగుదేశం పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. రాయపాటి సాంబశివరావు అనుచరుడిగా పేర్కొనే డొక్కా ఆయనతో పాటు తొలుత కాంగ్రెస్ పార్టీలో తరువాత ఆయనతో పాటు టీడీపీలోకి మారారు. వైఎస్సార్సీపీలో ప్రవేశించనున్నారన్న నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఆ సమయంలో ఆ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను మిత్రులు, శ్రేయోభిలాషులకు వివరిస్తూ ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో వివిధ విషయాలను వెల్లడించారు. ఆ లేఖ వివరాల్లోకి వెళ్తే… ‘మిత్రులు, శ్రేయోభిలాషులకు… నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ…’ అంటూ ప్రారంభించిన ఆయన, 2019 ఎన్నికల్లో తాను తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించానని తెలిపారు. అయితే పార్టీ అధినేత ఆ సీటును ముందుగానే వేరొకరికి కట్టబెట్టారని, తనను ప్రత్తిపాడు నుంచి పోటీకి పెట్టారని తెలిపారు. ఓటమి తప్పదని తెలిసినా పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేశానని అన్నారు.

ఓటమి తరువాత పార్టీ చూపిన ఉదాశీన వైఖరి తనను తీవ్ర వేదనకు గురిచేసిందని ఆయన తెలిపారు. తనకున్న సమాచారం మేరకు శాసన మండలి సమావేశాలు అత్యంత వివాదాస్పదంగా జరుగుతాయని గమనించానని, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ, శాసనమండలి మధ్య సమతౌల్యత దెబ్బతిని ప్రజాస్వామ్య భావనకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నట్టు గ్రహించి, వాటిలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, అయితే, ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు.

తాను ఏ పార్టీలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని డొక్కా వ్యాఖ్యానించారు. తనపై నీతి బాహ్యమైన, చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ప్రవర్తన ప్రజలకు సుస్పష్టమని అన్నారు. రాజకీయ పార్టీ అన్నది ప్రజా సేవకు ఓ వేదిక మాత్రమేనని, ఆ వేదిక ద్వారా తనదైన శైలిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని అన్నారు.

tags: mlc dokka, dokka manikya vara prasad, tdp mlc, open letter

Tags:    

Similar News