కరోనాతో పెంపుడు కుక్క మృతి

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే 25లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, లక్షకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో యూఎస్‌లోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారి ఓ పెంపుడు కుక్క కరోనాతో మరణించింది. జర్మన్ షెఫెర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం మరణించిందని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటించింది. ఏడేళ్ల వయసున్న బుడ్డీ అనే పెంపుడు శునకం ఏప్రిల్ నెలలో శ్వాస […]

Update: 2020-07-31 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే 25లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, లక్షకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో యూఎస్‌లోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారి ఓ పెంపుడు కుక్క కరోనాతో మరణించింది. జర్మన్ షెఫెర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం మరణించిందని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటించింది. ఏడేళ్ల వయసున్న బుడ్డీ అనే పెంపుడు శునకం ఏప్రిల్ నెలలో శ్వాస కోస సమస్యతో బాధపడింది. దానికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

బ్రీతింగ్ సమస్యతో ముక్కు మూసుకుపోవడంతో పెంపుడు శునకం రక్తపు వాంతులు చేసుకొని మరణించిందని మహోనీస్ చెప్పారు. అనంతరం దాని కళేబరాన్ని ఖననం చేశామన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 12 కుక్కలు, 10 పిల్లులు, ఓ పులి, సింహం కరోనా బారిన పడ్డాయని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలిపింది.

Tags:    

Similar News