పోడు భూములకు పట్టాలివ్వాలి.. టీడీపీ ప్రెసిడెంట్ బక్కని డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే పట్టాలివ్వాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ముంపు భూములకు గతంలో పునరావాస భూములను ఇచ్చారని, ఈ భూములను ఇతరులు ఖబ్జా చేశారని దీనిపై గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, ఆ భూములను తిరిగి గిరిజనులకే ఇవ్వాలని […]

Update: 2021-08-09 11:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే పట్టాలివ్వాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ముంపు భూములకు గతంలో పునరావాస భూములను ఇచ్చారని, ఈ భూములను ఇతరులు ఖబ్జా చేశారని దీనిపై గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, ఆ భూములను తిరిగి గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాల్లో ఆరోగ్య, వైద్య, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. గిరిజన చట్టాలపై మేధావులను పిలిపించి వర్కుషాపు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్విర రాజునాయక్, కార్యదర్శి జ్ఞానసుధ, విజయనాయక్, సుభాష్ యాదవ్, అశోక్, మహేష్నాయక్, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..