రిమ్స్ డైరెక్టర్‌ను తొలగించాలని వైద్యుల ఆందోళన

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌ను విధుల్లోంచి తొలగించాలని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో గురువారం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసుపత్రి డైరెక్టర్ తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా పనిచేయిస్తున్నారని వారు ఆరోపించారు. కోవిడ్- 19కు సంబంధించిన ప్రత్యేక వార్డులతో పాటు ఇతర వార్డులలో విధులు నిర్వహిస్తున్న వైద్యసిబ్బందికి పీపీఈ కిట్స్, మాస్కులు ఇవ్వకుండా విధులు నిర్వహించాలని ఆదేశిస్తూ.. వైద్యుల పట్ల […]

Update: 2020-05-21 07:15 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌ను విధుల్లోంచి తొలగించాలని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో గురువారం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసుపత్రి డైరెక్టర్ తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా పనిచేయిస్తున్నారని వారు ఆరోపించారు. కోవిడ్- 19కు సంబంధించిన ప్రత్యేక వార్డులతో పాటు ఇతర వార్డులలో విధులు నిర్వహిస్తున్న వైద్యసిబ్బందికి పీపీఈ కిట్స్, మాస్కులు ఇవ్వకుండా విధులు నిర్వహించాలని ఆదేశిస్తూ.. వైద్యుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రిమ్స్ డైరెక్టర్ బాణోత్ బలరాం నాయక్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ డైరెక్టర్ ఛాంబర్ ఎదుట డాక్టర్లు, సిబ్బంది తమ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. బాణోత్ బలరాం నాయక్‌ను విధుల నుంచి తొలగించేవరకూ తమ నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News