కరోనా పై నకిలీ రిపోర్టులు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19తో యావత్ ప్రపంచం వణికిపోతోంది. దగ్గు, జలుబు చేసిన వ్యక్తులను జనాలు ఇప్పటికే చాలా వరకు దూరం పెడుతున్నారు. ఇదే లక్షణాలతో చాలా మంది పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వస్తే హోం క్వారంటైన్ లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. నెగిటెవ్ వస్తే మాత్రం తగు టాబ్లెట్లు వేసుకొని నయం చేసుకుంటున్నారు. అయితే, కొవిడ్ వచ్చిందా లేదా అన్నదానికి మూలం రిపోర్ట్ ఒక్కటే. కానీ, కొంతమంది ప్రబుద్ధులు కాసుల కోసం తప్పుడు రిపోర్టులు […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19తో యావత్ ప్రపంచం వణికిపోతోంది. దగ్గు, జలుబు చేసిన వ్యక్తులను జనాలు ఇప్పటికే చాలా వరకు దూరం పెడుతున్నారు. ఇదే లక్షణాలతో చాలా మంది పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వస్తే హోం క్వారంటైన్ లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. నెగిటెవ్ వస్తే మాత్రం తగు టాబ్లెట్లు వేసుకొని నయం చేసుకుంటున్నారు.
అయితే, కొవిడ్ వచ్చిందా లేదా అన్నదానికి మూలం రిపోర్ట్ ఒక్కటే. కానీ, కొంతమంది ప్రబుద్ధులు కాసుల కోసం తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. ఇటువంటి ఓ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. డాక్టర్ కుష్ పరాశర్ తన వద్దకు కొవిడ్ పరీక్షల కోసం వచ్చిన వారికి తప్పుడు రిపోర్టులు ఇచ్చాడు. అతడి కింద ఉన్న సహాయకుడుతో శాంపిల్స్ సేకరించిన తర్వాత.. వాటిని పరీక్షించకుండానే పాజిటివ్ వచ్చిందని బాధితులకు అందజేశాడు.
ఈ వ్యవహారం పై అనుమానంతో పలువురు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీశారు. దీంతో తన వద్దకు వచ్చిన 75 మంది శాంపిల్స్ తీసుకొని పరీక్షించకముందే పాజిటివ్ వచ్చిందని రిపోర్టు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డాక్టర్, అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం పై స్థానికులు మండిపడుతున్నారు. అసలే.. వైరస్ తో సగం చస్తుంటే తప్పుడు రిపోర్టులు ఇస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.